Biren Singh To Be Manipur CM: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్, పదిరోజుల గ్యాప్ తర్వాత తేల్చిన బీజేపీ, మరోసారి పగ్గాలు చేపట్టనున్న బీరెన్, అభినందనలు తెలిపిన కేంద్రమంత్రులు

మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్ బీరెన్ సింగ్ (N Biren Singh ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇంఫాల్‌లో(Imphal) జరిగిన మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ను కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్ (Nirmala Sitaraman), కిరెన్ రిజిజు అభినందించారు

Imphal, March 20:  మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్ బీరెన్ సింగ్ (N Biren Singh ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇంఫాల్‌లో(Imphal) జరిగిన మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ను కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్ (Nirmala Sitaraman), కిరెన్ రిజిజు అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అందరూ ఇది ఏకగ్రీవంగా తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు. మణిపూర్‌లో స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండడానికి నిదర్శనమని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు.

గతంలో కూడా మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ పని చేశారు. ఈ నెల 10వ తేదీన మణిపూర్ ఎన్నికల  రిజల్డ్ రాగా, అక్కడ బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కాయి. దీంతో మరోసారి అధికారం చేజిక్కించుకుంది. కొత్త సీఎం అభ్యర్ధిపై బీజేపీ నానా విధాలుగా యత్నించింది. కానీ చివరకు పాత సీఎంనే కొనసాగించాలని నిర్ణయిచింది. అయితే కేబినెట్ లో మాత్రం మార్పులు జరుగనున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement