Rajasthan Shocker: పని కోసం వెళ్లిన మైనర్ బాలికపై తెగబడిన కామాంధులు, గదిలో బంధించి 5 మంది సామూహిక అత్యాచారం, రాజస్థాన్ జిల్లాలో దారుణ ఘటన, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ 16 ఏళ్ళ బాలిక పనికోసం వెళితే అయిదు మంది కామాంధులు ఆ మైనర్‌ బాలికపై తెగబడ్డారు. బాలిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని రాజస్థాన్‌లో మైనర్‌ బాలికపై ఇంటి పక్కనే ఉండే కొందరు యువకులు ఈ అఘాయిత్యానికి (16-year-old girl raped by 5) పాల్పడ్డారు.

Representational Image (Photo Credits: File Image)

Nagaur, August 31: రాజస్థాన్‌లో దారుణం చోటు (Rajasthan Shocker) చేసుకుంది. ఓ 16 ఏళ్ళ బాలిక పనికోసం వెళితే అయిదు మంది కామాంధులు ఆ మైనర్‌ బాలికపై తెగబడ్డారు. బాలిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని రాజస్థాన్‌లో మైనర్‌ బాలికపై ఇంటి పక్కనే ఉండే కొందరు యువకులు ఈ అఘాయిత్యానికి (16-year-old girl raped by 5) పాల్పడ్డారు. గత గురువారం (ఆగస్టు26)న నాగౌర్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జయాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల మైనర్‌ బాలిక.. పనికోసం తన ఇంటి పక్కన ఉండే హరిప్రసాద్‌ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో రామేశ్వర్‌, తన మిత్రులతో కలిసి ఇంట్లో ఉన్నాడు. వారు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత బాలికను ఒక గదిలో బంధించారు. వారంతా కలసి బాలికపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా.. విషయం ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.

తాగిన మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, మరో చోట 98 ఏళ్ల వృద్ధురాలిపై మరో వ్యక్తి లైంగిక దాడి, యూపీలో దారుణ ఘటనలు

దీంతో బాధితురాలు తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో.. బాలిక గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడికి గురవ్వటాన్ని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో యువతిని కారణం అడిగారు. ఆ తర్వాత యవతి జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తనపై ఐదురుగు యువకులు అత్యాచారం చేశారని కన్నీటి పర్యంత మయ్యింది.

ఆ యువతే గొంతు కోసుకుని కట్టు కథ అల్లింది, కామారెడ్డిలో మహిళ హత్యాయత్నం ఘటనను చేధించిన పోలీసులు, గతంలో ప్రేమ వ్యవహారమే ప్రస్తుత ఘటనకు కారణమని అనుమానాలు

వెంటనే బాధితురాలి తండ్రి, తన కూతురితో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మైనర్‌ బాలుడు ఉన్నట్లు తెలిపారు. మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని నాగౌర్‌ పోలీసు అధికారి రామేశ్వర్‌ లాల్‌ పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు