Nagpur Shocker: కామాంధుడైన బాయ్‌ఫ్రెండ్, పాత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి స్నేహితులతో కలిసి గర్ల్‌ఫ్రెండ్‌పై సామూహిక అత్యాచారం, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
మహారాష్ట్రలోని నాగపూర్‌లో దారుణ ఘటన వెలుగు (Nagpur Shocker) చూసింది. గతంలో రికార్డు చేసిన వీడియోను చూపి బెదిరించి బాలికపై ఆమె బాయ్‌ఫ్రెండ్ మరో ఇద్దరు సహచరులు సామూహిక లైంగిక దాడికి (Minor girl blackmailed, raped) పాల్పడ్డారు.
Mumbai, April 27: మహారాష్ట్రలోని నాగపూర్‌లో దారుణ ఘటన వెలుగు (Nagpur Shocker) చూసింది. గతంలో రికార్డు చేసిన వీడియోను చూపి బెదిరించి బాలికపై ఆమె బాయ్‌ఫ్రెండ్ మరో ఇద్దరు సహచరులు సామూహిక లైంగిక దాడికి (Minor girl blackmailed, raped) పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నాగపూర్‌లోని జరిపట్క ప్రాంతానికి చెందిన బాధితురాలు బుటిబోరి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది.
ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్న విద్యార్ధినికి అదే క్లాస్‌కు చెందిన యష్ ఆనంద్ కాంబ్లేతో పరిచయం ఏర్పడింది. ఆపై ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో బాయ్‌ఫ్రెండ్ కాంబ్లే అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేశాడు. ఇక ఏప్రిల్ 17న నిందితుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ( boyfriend and his associates) గర్ల్‌ఫ్రెండ్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో గతంలో రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపి తన ఇద్దరు స్నేహితులు బిట్టు, చికు సహా తన కోరిక తీర్చాలని లేకుంటే ఆ వీడియోను బహిర్గతం చేస్తానని బెదిరించాడు.
ఆపై ముగ్గురూ బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. నిందితులపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.