Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Amaravati, April 26: కామాంధులు వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. కన్న కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాటేస్తున్నాడు. తన కామదాహంతో సొంత కూతుళ్ల పైనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణం (Minor girl molested by her father) ఏపీలో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట (chilakaluripet) మండలం బొప్పూడిలో జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బొప్పూడి గ్రామానికి చెందిన నూర్‌బాషా ఆదాం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్‌ సాహెబ్‌పాలేనికి చెందిన హుస్సేన్‌బీతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. షఫీ బొప్పూడిలో కుటుంబంతో నివాసం ఉంటూ చిలకలూరిపేట పట్టణం కళామందిర్‌ సెంటర్‌లోని ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. రాత్రిపూట పాప తండ్రి వద్ద, చిన్నవాడైన బాబు తల్లి వద్ద నిద్రిస్తారు. ఇటీవల పాపను (Minor Grl) స్కూల్‌కు పంపే క్రమంలో తల్లి చిన్నారికి స్నానం చేయిస్తుండగా, తనకు జననాంగాల వద్ద నొప్పిగా ఉందని రాత్రి సమయాల్లో తండ్రి పక్కన పడుకోబెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది.

ఢిల్లీలో దారుణం, యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌కు ప్రతీకారంగా యువ‌తిపై సామూహిక అత్యాచారం, మొత్తం 762 పేజీలు ఛార్జీషీటు దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు, లిస్టులో 21 మంది పేర్లు

దీంతో ఆమె భర్త ప్రవర్తనపై కన్నేసింది. ఆదివారం రాత్రి భోజనం తర్వాత భర్త షఫీ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్‌బీ నిద్రపోతున్నట్లు నటించింది. సెల్‌ఫోన్‌ లైట్‌ వేసి భార్య నిద్రపోతున్నట్లు భావించి కుమార్తె పక్క చేరాడు. సెల్‌ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త దారుణం పసిగట్టిన హుస్సేన్‌బీ వెంటనే భర్తను నిలదీయడంతో పాటు బంధువులకు సమాచారం అందించింది.

తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించిన కొడుకు, బాధలు తట్టుకోలేక అతడి గొంతు కోసి చంపేసిన తల్లిదండ్రులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన

దీంతోపాటు చిలకలూరిపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.