Hyd, April 26: మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన కుమారుడి చేతిలో రోజూ పడుతున్న బాధలు తట్టుకోలేక తెలంగాణలో ఓ దంపతులు అతడిని గొంతుకోసి హత్య (Couple Kills Son Addicted To Liquor) చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna-Sircilla) సోమవారం చోటుచేసుకుంది. జి. బాలయ్యగౌడ్, అతని భార్య లావణ్య ఇద్దరు కుమారుల సాయంతో 23 ఏళ్ల నిఖిల్‌ను హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మద్యానికి, డ్రగ్స్‌కు బానిసైన నిఖిల్ సృష్టించిన సమస్యలతో (Drugs by Strangulating) గౌడ్, లావణ్య విసిగిపోయారు. రోజూ అతను తాగొచ్చి వారితో గొడవపడి హింసకు దిగేవాడు. నిఖిల్ ఒమన్ మరియు మలేషియాలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. రెండేళ్ల క్రితం ఇంటికి వచ్చిన అతడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి, డ్రగ్స్‌కు బానిస కావడంతో తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసులు కౌన్సెలింగ్‌లో అతనిలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. సోమవారం నిఖిల్ తాగి ఇంటికి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు.
గౌడ్ మందలించడంతో ఆగ్రహించిన నిఖిల్ రోకలితో దాడికి యత్నించాడు. గౌడ్ తనను తాను రక్షించుకోవడానికి అదే రోకలితో అతని కుమారుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతను గాయపడ్డాడు. మళ్లీ దాడి చేస్తారేమోనన్న భయంతో తల్లిదండ్రులు, నిఖిల్ ఇద్దరు సోదరులు వంశీ, అజయ్ అతడిని గట్టిగా పట్టుకున్నారు. నిఖిల్ మెడకు తాడు బిగించి గొంతుకోసి హత్య చేశారు. గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత తెలిపారు.