MSP Price Hike: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరలు పెంపు, వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచిన కేంద్రం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచారు. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది.

Paddy. (Photo Credits: Pixabay)

New Delhi, June 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచారు. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది.

పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్‌ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరి క్వింటాలుకు రూ.143 చొప్పున, మూంగ్ దాల్ క్వింటాలుకు రూ.803 చొప్పున, రాగులు క్వింటాలుకు రూ.268 చొప్పున పెంచారు.

వీడియో ఇదిగో, సిసోడియాను తలుచుకుంటూ ఏడ్చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జైలులో పెట్టారంటూ కన్నీటి పర్యంతం

మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Union Minister Piyush Goyal) మీడియాకు వివరించారు. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచినట్లు తెలిపారు. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు, రైతులకు సరసమైన ధర లభించేలా చూడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Here's MSP List

MSP List

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు పీయూష్‌ గోయల్‌ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఎంఎస్‌పీ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ప్రయాణికులకు అలర్ట్, నేటి నుంచి 13వ తేదీ దాకా పలు రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల పూర్తి లిస్ట్ ఇదిగో

వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,040 నుంచి రూ.2,183కు పెంచినట్లు తెలిపారు. మూంగ్ దాల్ ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచారు. మణిపూర్ హింసాకాండ, బాలాసోర్ రైలు దుర్ఘటనలలో ప్రాణాలు కోల్పోయినవారికి మంత్రివర్గం సంతాపం తెలిపిందని గోయల్ తెలిపారు. హుడా సిటీ సెంటర్‌ నుంచి గురుగ్రామ్‌లోని సైబర్‌ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 28.50 కి.మీల మేర 27 స్టేషన్ల మీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మంజూరైన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5452 కోట్లు.

ఎంఎస్‌పీ అంటే: రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించే ధరను కనీస మద్దతు ధర అంటారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఖరీఫ్ (యాసంగి) పంటలను కోసిన తర్వాత అక్టోబరు నుంచి రబీ (శీతాకాలం) పంట కాలం ప్రారంభమవుతుంది. గోధుమలు, ఆవాలు ప్రధాన రబీ పంటలు.

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎంఎస్‌పీ ధరలు

- సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో రూ.2,040 ఉండేది. దీనిని 2023-24 కోసం రూ.2,183కు పెంచారు. అంటే రూ.143 పెంచారు.

- గ్రేడ్ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,060 నుంచి రూ.143 పెంచి, రూ.2,203 చేశారు.

- హైబ్రిడ్ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు.

- రాగులు (చోళ్లు) క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. అంటే రూ.268 పెరిగింది.

- వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకుముందు ఇది రూ.5,850 ఉండేది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now