Delhi Shocker: తల్లి లేని టైం చూసి.. బాలికపై పలుమార్లు దారుణంగా అత్యాచారం, ఢిల్లీలో కామాంధుడి బల ప్రయోగం, మరో ఘటనలో డేటింగ్ యాప్ ద్వారా యువతిపై లైంగికదాడి
వావివరసలు మరిచి కామాంధులు చెలరేగుతున్నారు. తాజాగా పశ్చిమ ఢిల్లీలోని కీర్తినగర్ (Delhi’s Kirti Nagar) ప్రాంతంలో 14 ఏండ్ల బాలికపై పొరుగున ఉండే వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి (Neighbour arrested for raping minor ) పాల్పడ్డాడు.
Delhi, Feb 18: దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల (Delhi Shocker) ఘటనలు కొనసాగుతున్నాయి. వావివరసలు మరిచి కామాంధులు చెలరేగుతున్నారు. తాజాగా పశ్చిమ ఢిల్లీలోని కీర్తినగర్ (Delhi’s Kirti Nagar) ప్రాంతంలో 14 ఏండ్ల బాలికపై పొరుగున ఉండే వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి (Neighbour arrested for raping minor ) పాల్పడ్డాడు.
నిందితుడిని సర్వేష్ (27)గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్‌లో సర్వేష్ బాలికపై బలప్రయోగం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఐదు రోజుల తర్వాత మరోసారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులకు తెలపడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక దేశ రాజధానిలో డేటింగ్ యాప్ ద్వారా వైద్య విద్యార్ధిని (23)ని లోబరుచుకున్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన మరో ఘటన వెలుగుచూసింది. బాధితురాలు ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో పేయింగ్ గెస్ట్‌గా నివసిస్తుండగా నిందితుడిని అదే ప్రాంతంలో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేరవుతున్న రజ్‌నీష్ శర్మ (26)గా గుర్తించారు. ఈ దారుణ ఘటన వెలుగుచూసిన అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని సోమవారం జైపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డేటింగ్ యాప్‌లో పరిచయమైన నిందితుడు బాధితురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నిందితుడు ముఖం చాటేశాడు. బాధితురాలిని దూరం పెట్టేందుకు నగరాన్ని విడిచి జైపూర్‌కు తిరిగివెళ్లాడు. దీంతో ఫిబ్రవరి 11న బాధితురాలు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఇదే తరహా ఘటన ఇటీవల ఢిల్లీలో కలకలం రేపింది. మ్యాట్రిమోనియల్ సైట్‌లో మహిళలకు గాలం వేసి పెండ్లి పేరుతో ఎంబీఏ గ్రాడ్యుయేట్ పలువురిని మోసం చేశాడు. నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో అతడి నిర్వాకం బయటపడింది.