New Variant BA.12: భారత్‌లో మరో కరోనా కొత్త సబ్ వేరియంట్ వెలుగులోకి, పాట్నాలో బీఏ.12ను గుర్తించిన ఐజీఐఎంఎస్‌ అధికారులు, బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మంటున్న ప్రొఫెస‌ర్లు

ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (IGIMS)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 (New Variant BA.12) బ‌య‌ట‌ప‌డింది. ఇది క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

Norovirus | Representational Image (Photo Credits: Pixabay)

Patna, April 28: దేశంలో కొవిడ్‌-19 మ‌ళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశాయి. మాస్క్ ధరించకుంటే జరిమానా తప్పదని హెచ్చరించాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా కొత్త స‌బ్‌ వేరియంట్‌ను (New Omicron sub-variant) గుర్తించారు.

ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (IGIMS)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 (New Variant BA.12) బ‌య‌ట‌ప‌డింది. ఇది క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అధికారులు చెబుతున్నారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మేము క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశాం. 13 శాంపిళ్ల‌ను ప‌రీక్షించాం. అందులో ఒక‌టి బీఏ.12 స‌బ్ వేరియంట్‌గా గుర్తించాం.

కరోనా డేంజర్ బెల్స్, మళ్లీ మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన పలు రాష్ట్రాలు, ధరించకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరిక

మిగ‌తా 12 శాంపిళ్లు బీఏ.2 స‌బ్ వేరియంట్‌’ (BA.2) అని మైక్రోబ‌యాల‌జీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ న‌మ్ర‌తా కుమారి వెల్ల‌డించారు. ఇది బీఏ.2కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిపారు. అయినా, ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. బీఏ.12 స‌బ్‌ వేరియంట్‌ను మొద‌ట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ స‌బ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు పాట్నాలో వెలుగుచూశాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement