COVID-19: కరోనా డేంజర్ బెల్స్, మళ్లీ మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన పలు రాష్ట్రాలు, ధరించకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరిక
COVID Outbreak- Representational Image (Photo Credits: IANS)

New Delhi, April 28: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో (COVID Fouth Wave Fear) పలు రాష్ట్రాలు మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ని తప్పనిసరి చేశాయి. గత వారం కొవిడ్ -19 యొక్క నాల్గవ వేవ్ భయం నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా, యూపీతో పాటుగా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్కు ధరించాలనే ( Continue Wearing Masks As Cases Rise) ఆదేశాలను తిరిగి తీసుకువచ్చాయి.ఢిల్లీలో (Delhi) మాస్క్ తప్పనిసరి చేస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డీడీఎంఏ తెలిపింది.

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (UP Govt) రాజధాని లక్నో, ఆరు ఎన్‌సిఆర్ జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. హర్యానా ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. గురుగ్రామ్‌లో గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ఫరీదాబాద్, సోనిపట్, ఝజ్జర్ జిల్లాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ చెప్పారు.

దేశంలో రోజు రొజుకు పెరుగుతున్న కేసులు, గత 24 గంటల్లో 3,303 మందికి కరోనా, తాజాగా 39 మంది మృతి

పంజాబ్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర ఇండోర్ సమావేశాలలో ప్రజలు ప్రత్యేకంగా మాస్క్‌లు ధరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అమెరికాలో కరోనావైరస్ కల్లోలం, వారం రోజుల్లో 37 వేల మంది పిల్లలకు పైగా కరోనా, గత నెల రోజుల్లో 1,24,000 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదు

కర్నాటక ప్రభుత్వం ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. కేరళ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో మాస్క్‌లను తప్పనిసరి చేసింది. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోవా రాష్ట్రంలో తాజాగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తాజాగా ప్రజలు మాస్కులు ధరించాలని గోవా సర్కారు ఆదేశాలు జారీ చేసింది.ఛత్తీస్ ఘడ్, ఛండీఘడ్, తెలంగాణ, మహారాష్ట్రలలోనూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆయా రాష్ట్ర ఆరోగ్య శాఖల అధికారులు సూచించారు