Coronavirus in India (Photo Credits: PTI)

US, April 28: యుఎస్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. అమెరికాలో గత వారం రోజుల్లో 37 వేలకుపైగా చిన్న పిల్లల్లో కరోనా కేసులు (Over 37,000 child Covid cases) నమోదయ్యాయి. గత రెండు వారాలతో (US past week) పోల్చితే పిల్లల కరోనా కేసులు 43 శాతం మేర పెరిగాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ), చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ (సీహెచ్‌ఏ) ఈ మేరకు పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాలో 12.9 కోట్ల మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలిపాయి.

అయితే గత నెల రోజుల్లో 1,24,000 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయని ఒక నివేదికలో వెల్లడించాయి. కాగా, అమెరికాలో గత ఏడాది సెప్టెంబర్‌ తొలి వారం నుంచి 79 లక్షల కరోనా కేసులు అదనంగా నమోదైనట్లు ఒక వార్తా సంస్థ తెలిపింది. ఇందులో పిల్లల కరోనా కేసులు 19 శాతం మేర ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు రెండు కొత్త వేరియట్ల వల్ల వ్యాపిస్తున్న కరోనాపై అప్రమత్తం కావాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) హెచ్చరించింది.

విమానంలో సిగిరెట్ వెలిగించిన పైలట్, వెంటనే మంటలు వ్యాపించి 66 మంది సజీవ దహనం, 2016 మే 19న సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ MS804 ప్రమాదంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి..

పిల్లల ఆరోగ్యంపై వీటి తీవ్రత, దీర్ఘకాల ప్రభావం గురించి తెలుసుకునేందుకు వయసుల వారీగా కరోనా కేసుల నమోదు డేటాను అత్యవసరంగా సేకరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.