Cheetah Pregnant: ఈ చీతా ప్రెగ్నెంట్! గుడ్ న్యూస్ చెప్తున్న నేషనల్ పార్క్ సిబ్బంది, "ఆశ" ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ వార్తలు, ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందేనంటున్న నిపుణులు

చీతా (cheetah) సంరక్షణ నిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ల్యూరీ మార్కర్‌ మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఆశ గనక గర్భం దాలిస్తే ఇదే తన మొదటి గర్భం. పిల్లలు జన్మిస్తే వాటికి ప్రైవసీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అది తన పిల్లల పెంపకంపై దృష్టి పెట్టగలుగుతుంది’ అని పేర్కొన్నారు. ఆ చీతా గర్భం దాలిస్తే గనక మరికొద్ది నెలల్లో భారత్‌లో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

cheetath

Bhopal, OCT 01: 74 ఏళ్ల తర్వాత చీతాలు (cheetahs) మళ్లీ భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలు కునో నేషనల్‌ పార్క్‌లోని (Kuno National Park) ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. అయితే, వీటికి సంబంధించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. ‘ఆశ’ (Asha) అనే చీతా గర్భం (cheetah pregnant) దాల్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశ ప్రవర్తన, శారీరక భాష గర్భం దాల్చినట్లుగానే ఉందని.. ఎన్‌క్లోజర్‌ను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. అయితే, కచ్చితంగా నిర్ధరించలేమంటున్నారు. ఫలితం తేలాలంటే అక్టోబర్‌ చివరివరకు వేచిచూడాల్సిందేనన్నారు.  చీతా (cheetah) సంరక్షణ నిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ల్యూరీ మార్కర్‌ మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఆశ గనక గర్భం దాలిస్తే ఇదే తన మొదటి గర్భం. పిల్లలు జన్మిస్తే వాటికి ప్రైవసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆవరణలో ఎండుగడ్డి గుడిసె ఉండాలి. వాటికి మానవులు కనిపించకూడదు. తల్లి ప్రశాంతంగా ఉండేందుకు దానికి మరింత స్థలం కావాలి. అప్పుడే అది తన పిల్లల పెంపకంపై దృష్టి పెట్టగలుగుతుంది’ అని పేర్కొన్నారు. ఆ చీతా గర్భం దాలిస్తే గనక మరికొద్ది నెలల్లో భారత్‌లో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Cheetah In India: భారత దేశంలో చిరుతలు అంతరించి పోవడానికి, టీ, కాఫీలకు ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ తింటారు..  

దేశంలో చీతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నమీబియా (namibia) నుంచి 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 17న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు.

Cheetah is back: 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి రానున్న "చీతా"లు, పుట్టినరోజు నాడు ఎన్‌క్లోజర్‌లోకి వదలనున్న ప్రధాని మోదీ, ఖండం దాటి తొలిసారి చీతాల తరలింపు, ప్రత్యేకంగా విమానాన్నే డిజైన్ చేసిన అధికారులు  

1948లో మధ్యభారతంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా చీతాలు తిరిగి భారత్‌లో అడుగుపెట్టాయి. వాటిలో 4 నుంచి 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement