Cheetah is back: 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి రానున్న "చీతా"లు, పుట్టినరోజు నాడు ఎన్‌క్లోజర్‌లోకి వదలనున్న ప్రధాని మోదీ, ఖండం దాటి తొలిసారి చీతాల తరలింపు, ప్రత్యేకంగా విమానాన్నే డిజైన్ చేసిన అధికారులు

శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఓ ఖండంలో జీవిస్తున్న చిరుతపులులను (Cheetha) మరో ఖండంలో ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను భారత్ కు తీసుకురానున్న విషయం తెలిసిందే.

Cheetah is back: 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి రానున్న
cheetath

Bhopal, SEP 15: సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు (Modi Birthday). ఈ సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఓ ఖండంలో జీవిస్తున్న చిరుతపులులను (Cheetha) మరో ఖండంలో ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను భారత్ కు తీసుకురానున్న విషయం తెలిసిందే. రేపు అంటే సెప్టెంబర్ 16కు భారత్ కు నమీబియా చీతాలు చేరుకోనున్నాయి. నమీబియా (namibia) నుంచి తీసుకువచ్చిన చిరుతపులులను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టనున్నారు. అంటే ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందుగా నమీబియా (Namibia) నుంచి చిరుతలు కునో ప్రాంతానికి చేరుకోనున్నాయి. చీతాలు వచ్చాక ప్రధాని చీతాల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీని కోసం ఈ ప్రాంతంలో తాజాగా 10 హెలీప్యాడ్ లు నిర్మించారు. దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి..ఖండం దాటి నమీబియా నుంచి చిరుతపులులు భారత్ లోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి.

ప్ర‌ధాని మోడీ (Narendra Modi) పర్యటనను ఖరారు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం మధ్యప్రదేశ్ సీఎంవోకు (Mdhyapradesh CMO) సమాచారం అందించింది. ప్రధాని పర్యటన క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ చీతా ప్రాజెక్టును ప్రారంభించాలంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించిన విష‌యం తెలిసిందే.

Canada: వీడియో, కెనడాలో హిందూ ఆలయంను ధ్వంసం చేసిన దుండుగులు,భార‌త్‌కు వ్య‌తిరేకంగా ఆల‌యంపై రాత‌లు 

భారత జాతీయ జంతువు పులి‌. బెంగాల్ టైగ్రిస్ పులి. ఆ పులి ముఖం ఉన్న విమానంలోనే నమీబియా నుంచి భారత్ కు చీతాలు రానున్నాయి. ఈ ప్రత్యేక విమానం ఫోటోలను ఇండియన్ కమిషన్ విడుదల చేసింది. చీతాలను తీసుకురావటానికి ఇప్పటికే ఈ ప్రత్యేక విమానం న‌మీబియాకు చేరుకుంది. ఈ ప్రత్యేక విమానాన్ని ఇండియన్ కమిషన్ పులి ఫేస్ రూపంలో ఉన్న B747 జంబో జెట్ (Jumbo Jet) విమానం ఫోటోల‌ను రిలీజ్ చేసింది. ఉత్తర ఆఫ్రికాలోని నమీబియా దేశం నుంచి మొత్తం 8 చీతాల‌ను ఇండియాకు తీసుకురానున్నారు. దీని కోసం ప్ర‌త్యేక విమానం నమీబియాకు చేరుకుంది. ఆ విమానం ముఖ భాగాన్ని పులి ఫోటోతో డిజైన్ చేశారు. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీశాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ అంశంపై స్పందిస్తూ..గుడ్‌విల్ అంబాసిడ‌ర్ల‌కు వెల్క‌మ్ చెప్పేందుకు ఆతృత‌తో ఎదురుచూస్తున్నామ‌ని అన్నారు. కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత దేశంలో మ‌ళ్లీ ఆ పులి గాండ్రింపులు వినిపిస్తాయన్నారు. కాగా..చీతాలు అంత‌రించిన‌ట్లు 1952లోనే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. న‌మీబియా నుంచి తీసుకు వ‌స్తున్న 8 చీతాల‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు.

Kohinoor Diamond: బ్రిటన్ రాణి తలపై తెలుగింటి వజ్రం, క్వీన్ ఎలిజబెత్ మరణంతో వార్తల్లోకి కోహినూర్, తదుపరి ఎవరికి దక్కనుందో తెలుసా? కోహినూర్ చరిత్ర అంతా ఇంతా కాదు 

నమీబియా నుంచి తీసుకువచ్చే ఈ చీతాలు ఆకలితో రానున్నాయి. ఎందుకంటే చీతాలు ప్రయాణం అంతా ఖాళీ కడుపుతో ఉండాలని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. విమానంలో చీతాలు ప్రయాణించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలో అవి ఖాళీ కడుపుతో వస్తేనే సురక్షితం అనీ లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయని అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నమీబియా నుంచి భారత్ కు చీతాలు మాంచి ఆకలితో రానున్నాయన్నమాట.

(The above story first appeared on LatestLY on Sep 15, 2022 11:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).