Britain, SEP 09: కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే బాగా ప్రసిద్ధి చెందిన వజ్రం ఇది. 105.6 క్యారెట్లతో వెలుగులీనే ఈ వజ్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది. దీనికి ‘వెలుగుల కొండ’గానూ పేరుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (Queen Elizabeth II) కిరీటంలోని 2,800 వజ్రాల్లో కోహినూర్ (Kohinoor) కూడా ఒకటి. ఈ కిరీటాన్ని 1937లో తయారు చేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నిన్న మృతి చెందడంతో ఇప్పుడు ఈ కిరీటం ఎవ్వరికి వెళ్తుంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ (Prince Charles)ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే ఆయన ఆ హోదాలో కొనసాగే అవకాశం ఉంది. దీంతో కోహినూర్ వజ్రం ఉన్న కిరీటం ఛార్లెస్ సతీమణి కెమిల్లాకు (Camilla) రాణి హోదా వస్తుంది. దీంతో కోహినూర్‌ ఉన్న కిరీటం కెమిల్లా ధరించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది 70 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో బ్రిటన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లోనూ ప్రసంగించిన ఎలిజబెత్‌-II తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి అని అన్నారు.

Operation London Bridge: బ్రిటన్ రాణి మరణిస్తే ఏం చేస్తారో తెలుసా? మరణంపై ప్రకటన కోసం కోడ్ లాంగ్వేజ్, అన్ని దేశాల్లో అలర్ట్, ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరుతో ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం, ఏమేమి చేస్తారంటే? 

కోహినూర్ వజ్రానికి పెద్ద చరిత్రే ఉంది. భారత్ లోని గోల్కొండ గనుల్లో 14వ శతాబ్దంలో మొట్టమొదట కోహినూర్ వజ్రం (Kohinoor) దొరికింది. ఈ వజ్రం బ్రిటిషర్ల చేతుల్లోకి 1849లో వెళ్ళింది. అంతకముందు కూడా చాలా మంది చేతులు మారింది. 1849 నుంచి బ్రిటిష్ రాణి కిరీటంలో భాగంగా కోహినూర్ ఉన్నప్పటికీ.. దాని చారిత్రక యాజమాన్య హక్కుల విషయంలో మాత్రం భారత్ సహా నాలుగు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కోహినూర్‌ను తిరిగి భారత్‌కు రప్పించాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

Queen Elizabeth Death: క్వీన్ ఎలిజిబెత్ కన్నుమూత, కోహినూర్ వజ్రాన్ని కిరీటంలో ధరించే బ్రిటన్ రాణి ఎలిజిబెత్ జీవితంలో విశేషాలు ఇవే, భారత్ తో విడదీయరాని అనుబంధం, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. 

కోహినూర్ తో చారిత్రక సంబంధం ఉన్న అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్ యాజమాన్య హక్కులు కోరుతున్నాయి. ఈ వజ్రం 1849లో బ్రిటిషర్లు పంజాబ్‌ను ఆక్రమించిన అనంతరం విక్టోరియా రాణి వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత ఆ రాజ కుటుంబం కిరీటంలో భాగంగా ఉంటోంది. 2005లో ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ రెండో వివాహం కెమిల్లాతో జరిగింది. కెమిల్లాకు కూడా అంతకుముందు పెళ్ళి జరిగింది. ఛార్లెస్‌ ప్రిన్స్‌ డయానాకు 1996లో వారు విడాకులు ఇచ్చారు. దీంతో ఛార్లెస్ సతీమణి కెమిల్లాకే ఈ కిరీటం వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. పాలన సమయంలో పలు దేశాల నుంచి తీసుకెళ్ళిన పురాతన కళాఖండాలను తిరిగి ఆయా దేశాలకు ఇచ్చేయాలని డిమాండ్ ఉంది.