Newyork, Oct 29: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నివాసంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ విమానాన్ని (Civilian aircraft) యూఎస్ ఫైటర్ జెట్లు తరిమికొట్టాయి. డెలావేర్‌లోని (Delaware) విల్మింగ్టన్‌లో ఉన్న బైడెన్ నివాసంపై ఓ పౌర విమానం తిరుగుతున్నది. అది నోఫ్లయింగ్ జోన్ కావడంతో.. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత గగణ తలంలో (Restricted airspace) చక్కర్లు కొడుతున్న విమానాన్ని వాయుసేన గుర్తించింది. ఆ సమయంలో బైడెన్ అక్కడం ఉండటంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైటర్ జట్లు (US fighter jets) ఆ విమానాన్ని అక్కడి నుంచి తరిమికొట్టాయి. దీనివల్ల అధ్యక్షుడికి ఎలాంటి అసౌకర్యం కలుగలేదని అధికారులు తెలిపారు.
Fighter jets scrambled as civilian aircraft breaches restricted airspace near US president's Joe Biden's Delaware home - Times of Indiahttps://t.co/UgYv2Kmryu
— Alvi (@alvi_alvisyauqi) October 29, 2023
సురక్షితంగా ల్యాండ్
ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు (స్థానిక కాలమానం) చోటుచేసుకున్నదని వెల్లడించారు. కాగా, ఆ విమానం సమీపంలోని ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిందని చెప్పారు. అసలు నిషేధిత ప్రాంతంలోకి ఆ విమానం ఎందుకు వచ్చిందనే విషయమై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు.