Punjab Shocker: స్నేహితుడే కామాంధుడయ్యాడు, యువతి లిఫ్ట్ అడిగినందుకు దారుణంగా రేప్ చేసిన ఆమె స్నేహితుడు, కేసు న‌మోదు చేసిన పంజాబ్ జిరక్‌పూర్‌ పోలీసులు

మొహలి జిల్లాలోని జిరక్‌పూర్‌లో 22 ఏళ్ల యువతిపై అతని స్నేహితుడే అత్యాచారానికి (22-year-old woman raped) పాల్పడ్డారు.లిఫ్ట్ ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి యువ‌తిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Zirakpur, Nov 1: పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొహలి జిల్లాలోని జిరక్‌పూర్‌లో 22 ఏళ్ల యువతిపై అతని స్నేహితుడే అత్యాచారానికి (22-year-old woman raped) పాల్పడ్డారు.లిఫ్ట్ ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి యువ‌తిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అక్టోబ‌ర్ 29 రాత్రి బ‌ర్నాలా నుంచి మొహాలీకి (Mohali district) తిరిగివ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని జిరక్ పూర్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ల‌గేజ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో బ‌స్టాప్ నుంచి త‌న‌ను పిక‌ప్ చేసుకోవాల‌ని ఆమె త‌న స్నేహితుడు కుష్వింద‌ర్‌కు ఫోన్ చేసింది. ఎస్‌యూవీలో బ‌స్టాప్ వ‌ద్ద ఆమెను రాత్రి ఎనిమిది గంట‌ల ప్రాంతంలో కుష్వింద‌ర్ పిక‌ప్ చేసుకున్నాడు. అయితే ఆమె ఉంటున్న పేయింగ్ గెస్ట్ వ‌స‌తి వ‌ద్ద విడిచిపెట్ట‌కుండా బాధితురాలిని నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకువెళ్లాడు. ఆపై ఆమెను తుపాకీతో బెదిరించి (gunpoint by friend in Zirakpur) లైంగిక దాడికి పాల్ప‌డి రోడ్డుపై వదిలివేసి ప‌రార‌య్యాడు. క్యాబ్‌లో ఎలాగో ఇంటికి చేరుకున్న బాధితురాలు మ‌రుస‌టి రోజు కుష్వింద‌ర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

పిల్లోడు కాదు కామాంధుడు, యువతిని పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం, తిరగబడటంతో ఆమె చేతులు క‌ట్టేసి రాయితో దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (రేప్), 365 (ఒక వ్యక్తిని రహస్యంగా మరియు తప్పుగా నిర్బంధించాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ లేదా అపహరణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేయబడింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif