Rapist Jalebi Baba: 120 మంది మహిళలపై అత్యాచారం చేసిన దొంగ బాబా, రేప్ వీడియోలతో మహిళలను బ్లాక్ మెయిల్‌ చేసే జిలేబీ బాబా, ఫ్రాస్ట్ ట్రాక్ కోర్టులో పండిన పాపం, 14 ఏళ్లు జైలు శిక్ష

అమర్ వీర్ కుటుంబం గురించి ఎంక్వైరీ చేశారు. అతడికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య చనిపోయింది. 23 ఏళ్ల కిందట పంజాబ్ లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహానా వలస వచ్చాడు. 13 ఏళ్ల పాటు అతడు ఓ జిలేబీ దుకాణం నడిపాడు.

Self-styled godman ‘Jalebi Baba (PIC @ ANI Twitter)

Chandigarh, JAN 11: హర్యానాలో బాబా ముసుగులో ఓ వ్యక్తి చేసిన అఘాయిత్యాలు విన్న పోలీసులే షాక్ కు గురవుతున్నారు. అతను బాబా ముసుగులో దారుణాలకు ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కామ వాంఛలు తీర్చుకున్నాడు. పది మంది 20 మంది కాదు.. ఏకంగా 120 మంది మహిళలను అత్యాచారం చేశాడు. చివరికి ఆ కీచక బాబా పాపం పండింది. కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో అమర్ పురి (Amarpuri alias Billu) అలియాస్ బిల్లూ (63) అనే కీచకుడు 120 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు కోర్టులో రుజువైంది. ఫతేహాబాద్ జిల్లా తొహానా పట్టణానికి చెందిన అమర్ వీర్ (Amarpuri) కీచక బాబా. అతడిని అందరూ జిలేబీ బాబా (Jalebi Baba) అని పిలుస్తారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాదు ఈ నీచుడు.. తన అఘాయిత్యాలను వీడియో తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారాలకు (Rape) పాల్పడేవాడని కోర్టు గుర్తించింది. అత్యాచారానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో జిలేబీ బాబాను పోలీసులు 2019 జులై 19న అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కీచక బాబా దారుణాలు బట్టబయలయ్యాయి. ఏకంగా 120 వీడియో క్లిప్పింగ్ లు బయటపడ్డాయి. అతడు తన మొబైల్ ఫోన్ తో అత్యాచారకాండను వీడియో తీసేవాడని పోలీసులు తెలిపారు.

Telegram Fraud Alert: టెలిగ్రామ్‌లో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి లింక్ లు క్లిక్ చేస్తున్నారా, అయితే మీరు సైబర్ బారీలో పడినట్లే, హెచ్చరికలు జారీ చేసిన విశాఖ పోలీసులు 

విచారణలో పోలీసులు అమర్ పురి (Amarpuri) అలియాస్ బిల్లూ గురించి వివరాలు తెలుసుకున్నారు. అమర్ వీర్ కుటుంబం గురించి ఎంక్వైరీ చేశారు. అతడికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య చనిపోయింది. 23 ఏళ్ల కిందట పంజాబ్ లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహానా వలస వచ్చాడు. 13 ఏళ్ల పాటు అతడు ఓ జిలేబీ దుకాణం నడిపాడు. ఆ సమయంలో ఓ తాంత్రికుడితో పరిచయం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. క్షుద్రపూజలపై ఆసక్తి చూపాడు.

Miley Cyrus Video: బాత్ రూంలో స్నానం చేస్తూ నగ్న వీడియోని షేర్ చేసిన ప్రముఖ నటి మిలే సైరస్‌, ప్రమోషన్స్‌ కోసం ఇంతలా దిగజారాల అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు 

ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయాడు. కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చాడు. ఓ ఆలయం పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. అది మొదలు.. తనను తాను బాబాగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో పలువురు భక్తులను తయారు చేసుకున్నాడు. వారిలో చాలామంది మహిళలు ఉన్నారు. భక్తుల్లో నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత.. జిలేబీ బాబా తన అసలు రూపం బయటపెట్టాడు. అత్యాచారాలకు ఒడిగట్టాడు. 2018లో ఓ పరిచయస్తుడి భార్యపై గుడిలో అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే ఈ కేసులో అతడికి బెయిల్ లభించింది. ఆ తర్వాత బాబా అత్యాచారానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ కీచక బాబా పాపం పండింది. నేరాలు నిరూపితం కావడంతో జిలేబీ బాబాకు శిక్ష విధించనుంది కోర్టు.

” మాకు లభించిన క్లిప్పింగ్‌లలో లైంగిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తి జిలేబీ బాబా అని గుర్తించాయి. బాధిత మహిళల్లో ఇద్దరు ఇప్పటికే మా ముందుకు వచ్చారు. మొబైల్ ఫోన్ సాయంతో అన్ని అఘాయిత్యాలను బాబా వీడియో తీశాడు” అని పోలీసులు వెల్లడించారు. ”కీచక బాబా దగ్గరకు ఎక్కువగా మహిళలే వచ్చే వారు. వారిలో చాలా మంది దెయ్యాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు బాబా వద్దకు వచ్చేవారని పోలీసుల విచారణలో తేలింది. “నిందితుడు తాంత్రికుడు. తన వద్దకు వచ్చిన మహిళలకు మాయమాటలు చెప్పి ద్రవం రూపంలో డ్రగ్స్ ఇచ్చే వాడు. వాళ్లు మత్తులో జారుకున్నాక లైంగిక దాడికి పాల్పడేవాడు. అదంతా వీడియో తీసి వాటి ద్వారా బాధితులను బ్లాక్ మెయిల్ (Blockmail) చేసి డబ్బు దండుకునే వాడు” అని పోలీసులు తెలిపారు.