RBI Governor Shaktikanta Das in Hospital: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థతకు గురతయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని అపోలో దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Chennai, Nov 26: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) అస్వస్థతకు గురతయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని అపోలో దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ వైద్యులతో కూడిన బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు. ఇది అత్యవసర చికిత్స కాదని పేర్కొన్నారు. ఛాతీలో నొప్పి కారణంగానే శక్తికాంత దాస్ హాస్పిటల్ లో చేరినట్టు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.
వచ్చే నెల 10న ముగియనున్న పదవీకాలం
ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ పదవీకాలం వచ్చే నెల 10న ముగియనుంది. 1980 తమిళనాడు క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్.. 2018 డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం శక్తికాంత దాస్‌ను నియమించింది.