Red Stream on Hyderabad Roads: హైదరాబాద్ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)
అది హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ ప్రాంతం. సోమవారం సాయంత్రం కాలనీవాసులు కాస్త సేదతీరుతూ ముచ్చటించుకుంటున్నారు. పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వీధిలోని రోడ్డుమీదకు ఓ ఎర్రని ద్రవం ఏరులై పారింది.
Hyderabad, Nov 26: అది హైదరాబాద్ (Hyderabad) లోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ ప్రాంతం. సోమవారం సాయంత్రం కాలనీవాసులు కాస్త సేదతీరుతూ ముచ్చటించుకుంటున్నారు. పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వీధిలోని రోడ్డుమీదకు ఓ ఎర్రని ద్రవం (Red Liquid) ఏరులై పారింది. మ్యాన్ హోల్ నుంచి ఎరుపు రంగు నీరు ఒక్కసారిగా ఉబికి వస్తుండటాన్ని చూసి స్థానికులు భయపడిపోయారు. నిమిషాల్లోనే ప్రవాహం పెరిగిపోయి రెండు రోడ్లలో పారుతూ తీవ్ర దుర్గంధం రావడం మొదలుపెట్టింది. రక్తం రోడ్డు మీద పారుతుందేమోనని భయపడ్డ స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు.
Here's Video:
హైదరాబాద్లో ఎరుపెక్కిన రహదారి!
జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్లో మ్యాన్ హోల్ నుంచి ఎరుపు రంగు నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. రెండు రోడ్లలో పారుతూ తీవ్ర దుర్గంధం రావడంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు.… pic.twitter.com/tXqOTcUxtd
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2024
మరేంటి??
అయితే, రోడ్డు మీద పారింది రక్తం కాదని.. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తున్నారని తెలుసుకొన్న స్థానికులు కాసింత కుదుటపడ్డారు. నివాస ప్రాంతాలు ఉండే కాలనీల్లో ఇలా చేయడం ఏంటని పలువురు వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Nov 26, 2024 09:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

