Sex Workers To Get Pensions: సెక్స్‌ వర్కర్లకు పెన్సన్ ఇచ్చేలా చట్టం తీసుకువచ్చిన బెల్జియం, ప్రపంచంలో ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా రికార్డు

సెక్స్‌ వర్కర్లకు కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్‌ దేశం ‘బెల్జియం’ సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా సెక్స్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అందుబాటులోకి వస్తాయి.

Sex Rocket Representational Image. (Photo Credit: Getty)

సెక్స్‌ వర్కర్లకు కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్‌ దేశం ‘బెల్జియం’ సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా సెక్స్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ చట్టం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా బెల్జియం నిలిచింది.

ఇకపై కండోమ్ అవసరం లేదు, ఏడాదికి రెండు లెనాకావిర్ టీకాలతో హెచ్‌ఐవికి చెక్, సరికొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

‘సెక్స్‌ వర్క్‌’ నేరం కాదని 2022లోనే పేర్కొన్న బెల్జియం, తాజా చట్టంతో ఇతర వృత్తులకు సమానంగా సామాజిక, కార్మిక హక్కుల్ని వారికి కల్పించింది. దీంతో ఇకపై ఏజెన్సీలు(యాజమాన్యాలు) వారికి ఆరోగ్య, జీవిత బీమా, ప్రసూతి సెలవులు, సిక్‌ హాలిడేస్‌ మొదలైనవి అమలుజేయాల్సి ఉంటుంది. బెల్జియం తీసుకొచ్చిన చట్టంపై హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సెక్క్‌ వర్క్‌లో ఉండే దోపిడీ, మానవ అక్రమ రవాణా, వేధింపులను ఈ చట్టం అడ్డుకోలేదని కొంతమంది విమర్శకులు హెచ్చరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement