Karnataka Shocker: ప్రేమించడంలేదని ప్రియురాలిని చంపేశాడు, ఆ తర్వాత విషం తాగి చనిపోయాడు, కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో విషాద ఘటన

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా శివార్లలోని బనుకులి గ్రామం సమీపంలో ప్రియురాలిని హత్య (Boy stabs girl to death) చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువతిని హత్య చేసిన యువకుడు ఆత్మహత్యకు (attempts suicide) యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Shivamogga, August 28: కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా శివార్లలోని బనుకులి గ్రామం సమీపంలో ప్రియురాలిని హత్య (Boy stabs girl to death) చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువతిని హత్య చేసిన యువకుడు ఆత్మహత్యకు (attempts suicide) యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శివమొగ్గ జిల్లా, హోసనగర తాలూకాలో చోటు చేసుకుంది. హోసనగర తాలూకా, రిప్పన్‌పేట సమీపంలోని కగ్గళి గ్రామానికి చెందిన శివమూర్తి(23) శివమొగ్గ జిల్లా సాగర తాలూకా కార్గల్‌ గ్రామ సమీపంలోని కనూరు గ్రామానికి చెందిన కవితను (22)ను ఇష్టపడ్డాడు.

అయితే అతని ప్రేమను ఆమె అంగీకరించలేదు.దీంతో ఈ నెల 25న బెళ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నరిగా అటవీ ప్రాంతంలో హోసకెరె చెరువు వద్దకు కవితను తీసుకెళ్లి చున్నీతో గొంతు బిగించి హత్య చేసి విషం సేవించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సాగర పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే కవిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన ఊపిరితో ఉన్న శివమూర్తి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

కండోమ్ లేదని పురుషాంగానికి సీల్ వేసుకుని సెక్స్, తరువాత చెట్ల పొదల్లో అపస్మారకంగా పడిన యువకుడు, చికిత్స పొందుతూ మృతి, గుజరాత్ అహ్మదాబాద్‌లో ఘటన

యువకుడు డెత్ నోట్ రాసి విషం తాగాడు. ఆ డెత్ నోట్ లో..నేను ప్రాణం కంటే ఎక్కువగా ఆ అమ్మాయిని ప్రేమించాను. అయితే ఆ అమ్మాయి నా ప్రేమను కాదని వేరే వారితో తిరుగుతోంది. అతనితో ప్రేమలో పడి నన్ను పట్టించుకోవడం మానేసింది. అందుకే నేను నా ప్రియురాలిని చంపేశారు. కవిత నన్ను మోసం చేసింది. ప్రేమను ఎన్నటికీ నమ్మవద్దు అంటూ రాశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement