Sperm Donor Has No Legal Right on Child: వీర్యం, అండ దానం చేసిన వారికి పిల్లలపై ఎలాంటి హక్కు ఉండదు, కీలక తీర్పును వెలువరించిన బాంబే హైకోర్టు

వీర్యం, అండ దానం చేసిన దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వారిని పిల్లలకు జీవ సంబంధ(బయలాజికల్‌) తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తెలిపింది. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Bombay-High-Court

Sperm Donor Has No Legal Right on Child: వీర్యం, అండ దానం చేసిన దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వారిని పిల్లలకు జీవ సంబంధ(బయలాజికల్‌) తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తెలిపింది. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

విభేదాల కారణంగా 2021లో మహిళ భర్త ఇద్దరు పిల్లలను తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ పిల్లల బాగోగులను పిటిషనర్‌ (భార్య) సోదరి చూసుకుంటుందని అతడు తెలపడంతో పిటిషనర్‌ స్థానిక కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో హైకోర్టులో కేసు వేశారు.  భర్తకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ప్రామిస్‌తో ప్రియుడితో శృంగారం, కీలక వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు

తన పిల్లలు అద్దె గర్భం ద్వారా పుట్టారని.. ప్రస్తుతం వారు తన భర్త, సోదరితో ఉంటున్నారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపింది. తన సోదరే తనకు అండం దానం చేసిందని.. అయితే ఆమెకే పిల్లలపై చట్టబద్ధ హక్కు ఉంటుందని తన భర్త వాదిస్తున్నాడని కోర్టుకు తెలిపింది.అయితే భర్త వాదనను కోర్టు తోసిపుచ్చింది.వారికి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement