Protest in Nagarjuna University: సాంబార్‌ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)

నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్‌ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు.

Protest in Nagarjuna University (Credits: X)

Guntur, Nov 30: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో (Nagarjuna University) విద్యార్థినులు (Students) ధర్నాకు (Protest) దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్‌ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు. ఈ విషయం బయటకు రాకుండా ఏఎన్‌యూ అధికారులు జాగ్రత్త పడ్డట్టు విద్యార్థినులు ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ రాత్రి వసతిగృహం వద్ద విద్యార్థినులు ధర్నాకు దిగారు.

తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 5 శాతం ఐఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి

Here's Video:

లోకేష్ స్పందన

నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థినుల వసతిగృహ వార్డెన్‌ ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్‌ గా ఉన్న వార్డెన్‌ పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement