Rajinikanth Reaction On Tirumala Laddu: తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రియాక్ష‌న్ చూశారా? వెట్ట‌యాన్ ప్ర‌మోష‌న్ లో ర‌జ‌నీ ఏం చెప్పాడంటే?

ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆస‌క్తి కనబరచలేదు.

Credits: Twitter

Chennai, SEP 28: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)ని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆస‌క్తి కనబరచలేదు. రజనీకాంత్‌ ప్రస్తుతం వేట్టయాన్‌ (Vettayan) ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై స్పందన మీ స్పందన ఏంటీ? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రజనీ సారీ నో కామెంట్స్‌ అంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

SIT Team Visits Tirumala: తిరుమలలో సిట్ టీం, కల్తీ నెయ్యిపై విచారణ..వీడియోలు ఇవిగో  

ఇదిలా ఉండగా.. కార్తీపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సత్యం సుందరం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ అడిగిన ఓ ప్రశ్నకు.. ‘లడ్డూలపై మాట్లాడొద్దు.. సున్నితమైన అంశం’ సమాధానం ఇచ్చారు. ఈ కామెంట్స్‌ వైరల్‌ కాగా.. కార్తీపై మండిపడ్డారు.

Ajith Kumar Racing Team: సొంత‌ రేసింగ్ టీమ్ అనౌన్స్ చేసిన స్టార్ హీరో, ఓ వైపు సినిమాలు..మ‌రో వైపు రేసింగ్..రెండింట్లో దూసుకుపోతున్న అజిత్ 

సనాతన ధర్మంపై ఎవరూ సరదాగా మాట్లాడొద్దని.. నటులు హుందాగా మాట్లాడాలని.. లేకపోతే మౌనంగా ఉండాలన్నారు. లడ్డూ వివాదంపై జోకులేయొద్దంటూ హెచ్చరించారు. ఆ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా కార్తీ సారీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌ లడ్డూలపై ప్రశ్న ఎదురవగా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లిపోవడం గమనర్హాం. రజనీకాంత్‌ నటించిన వేట్టయాన్‌ వచ్చే నెల 10న విడుదల కానున్నది. ఈ మూవీలో రజనీకాంత్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పవర్‌ ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నటించనున్నారు. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ ఈ మూవీని నిర్మించారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మంజు వారియర్‌, ఫ‌హాద్ ఫాజిల్, దుషారా విజ‌య‌న్‌, రానా ద‌గ్గుబాటి, అభిరామి కీలపాత్రల్లో నటిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement