Ajith Kumar Racing Team

Chennai, SEP28: కోలీవుడ్ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) అంటే యాక్ష‌న్ సినిమాలే కాదు రేస‌ర్‌గా అత‌డి బైక్ విన్యాసాలు గుర్తుకొస్తాయి. స్పోర్ట్స్ బండిని రయ్‌మంటూ రాకెట్ స్పీడ్‌తో ఉరికించ‌డ‌మంటే అత‌డికి మ‌హా స‌ర‌దా. స్వ‌త‌హాగా రేస‌ర్ అయిన అజిత్ షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు బైక్ , కారుఎక్కేసి లాంగ్ డ్రైవ్‌ల‌కు వెళుతుంటాడు. ఇప్ప‌టివ‌ర‌కూ రేస‌ర్‌గానే మ‌నంద‌రికి తెలిసిన ఈ స్టార్ హీరో కారు రేసింగ్‌లోకి మ‌రో ముందుడుగు వేశాడు. ఈమ‌ధ్యే అజిత్ సొంతంగా ‘అజిత్ కుమార్ రేసింగ్’ అనే పేరుతో టీమ్‌ను ప్రారంభించాడు. పాపుల‌ర్ రేసింగ్ డ్రైవ‌ర్ అయిన ఫాబియ‌న్ డ‌ఫ్లెక్స్ (Fabien Duffleux) అజిత్ జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే 24 గంట‌ల‌ యూరోపియ‌న్ సిరీస్ పోర్షే 992 జీటీ3 క‌ప్ విభాగంలో అజిత్ రేసింగ్ టీమ్ పోటీ ప‌డ‌నుంది.

Here's the tweet

 

ఓవైపు సినిమాల‌తో మ‌ల‌యాళ‌, తెలుగు అభిమానులను అల‌రిస్తూనే అజిత్ రేసింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. గ‌తంలో అత‌డు ఎఫ్ఐఏ (ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆటోమొబైల్) పోటీల్లో పాల్గొన్నాడు. 2004లో జ‌రిగిన ఆసియా బీఎండ‌బ్ల్యూ ఎఫ్ 3 చాంపియ‌న్‌షిప్స్‌లోనూ అజిత్ ర‌య్‌మంటూ దూసుకెళ్లాడు.

Chiranjeevi At IIFA 2024: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, ఐఫా అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్, వేదికపై బాలయ్య,వెంకీ కూడా 

అజిత్ తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) అనే సినిమాలో న‌టిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌. యాక్ష‌న్, కామెడీ క‌ల‌గ‌ల‌సిన ఈ చిత్రానికి అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. దాదాపు షూటింగ్ పూర్తికావొచ్చిన‌ ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక తెలుగులో డ‌బ్ అయిన ‘జోడీ’, ‘వ‌లిమై’, ‘విశ్వాసం’, ‘ఎంత‌వాడుగానీ’.. వంటి చిత్రాలు అజిత్‌ను తెలుగు అభిమానుల‌కు ద‌గ్గ‌ర చేశాయి.