SC Bans BS-IV Vehicles Registration: బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆటోమొబైల్​ డీలర్ల అసోసియేషన్లకు ఆదేశాలు

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కాలంలో అమ్ముడైన బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు (SC Bans BS-IV Vehicles Registration) వేసింది. లాక్​డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. కరోనా లాక్​డౌన్​ సమయంలోనూ బీఎస్​-4 వాహనాల అమ్మకాలు (BS-IV Vehicles Solds) జరగడంపై సుప్రీంకోర్టుమండిపడింది. ఈ వాహనాల రిజిస్ట్రేషన్లపై తాము చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం (Supreme Court) ఆదేశించింది.

Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, July 31: దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కాలంలో అమ్ముడైన బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు (SC Bans BS-IV Vehicles Registration) వేసింది. లాక్​డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. కరోనా లాక్​డౌన్​ సమయంలోనూ బీఎస్​-4 వాహనాల అమ్మకాలు (BS-IV Vehicles Solds) జరగడంపై సుప్రీంకోర్టుమండిపడింది. ఈ వాహనాల రిజిస్ట్రేషన్లపై తాము చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం (Supreme Court) ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి.. అమ్మకాలు చేశారని ఆటోమొబైల్​ డీలర్ల అసోసియేషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చిలోనే ఈ వాహనాల అమ్మకాలపై కోర్టు నిషేధం విధించినా.. ఆ నెల 31 తర్వాత అమ్మకాలు కొనసాగించడాన్ని సుప్రీం తప్పుపట్టింది. చైనాపై ఇండియా డేగ కన్ను, సరిహద్దుల్లో 35 వేల మందితో పహరా, ఇంకా ఫలితం తేలని ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు

వాహన డీలర్ల వద్ద ఉన్న బీఎస్‌-4 వాహనాలకు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని మార్చి 27న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్శాసనం.. తదుపరి ఆదేశాల వరకు బీఎస్​-4 వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.

వేరే దేశాలకు బీఎస్​-4 వాహనాలను ఎగుమతి చేసి, అక్కడ అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని డీలర్ల సంఘం కోరికపైనా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని దేశాలు ఇప్పటికీ బీఎస్​-4 విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టలేదని డీలర్లు పేర్కొనగా.. తాము ఎందుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది. అమ్మకాల విషయంలో విధించిన తుది గడువు తయారీదారులకు తెలిసినా ఎందుకు మరింత ఉత్పత్తి చేశారని ప్రశ్నించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement