Supreme Court: అవి కోచింగ్ సెంటర్లు కాదు డెత్ ఛాంబర్స్ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు,విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కోచింగ్ సెంటర్లు అని కామెంట్

భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించిన విషయం తెలిసిందే. సెల్లార్‌లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా గత నెల 27న రాత్రి భారీ వర్షాలకు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది.

Supreme Court Says Coaching centres have become death chambers issues notice to Centre and Delhi govt(X)

Delhi, Aug 4: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించిన విషయం తెలిసిందే. సెల్లార్‌లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా గత నెల 27న రాత్రి భారీ వర్షాలకు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. విద్యార్థులు సంబంధింత కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని అప్పటి నుండి ఆందోళన చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. అవి కోచింగ్ సెంటర్లు కాదు డెత్ ఛాంబర్లు అని అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం. కోచింగ్‌ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని...ఈ ఘటన ఓ కనువిప్పు లాంటిదని అభిప్రాయపడింది.

ఇకపై అన్ని భద్రతా ప్రమాణాలను పాటించే కోచింగ్‌ సంస్థలకే అనుమతులు ఇవ్వాలని ..రావూస్‌ ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు, త్వరలో ఉప ఎన్నిక ఖాయమన్న కేటీఆర్

ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్‌(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్‌ దల్వైన్‌(29) వరదనీటిలో మునిగి మరణించిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Advertisement
Advertisement
Share Now
Advertisement