KTR BRS at Delhi meets legal-experts over disqualification of Party Change MLAs Party Change(X)

Delhi, Aug 5:  పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు అని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందంతో కలిసి రాజ్యంగ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు తేల్చి చెప్పారు.

కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందన్న రాజ్యాంగ నిపుణులు చెప్పడంతో రాబోయే ఉప ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలోనే బుద్దం చెప్తామని తేల్చి చెప్పారు.

హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అర్హత వేటు అంశం తేలిపోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు.

గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కు చేసిన ఫిర్యాదు వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు అందించారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్

సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.