Tamil Nadu: జూనియర్ల ప్రైవేట్ పార్టులపై కొడుతూ సీనియర్లు ర్యాగింగ్, అర్థనగ్నంగా ఒకరికొకరు కౌగిలించుకువాలని వేధింపులు, తమిళనాడు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం, ఏడుగురు విద్యార్థులపై వేటు

తమిళనాడులోని ఓ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్‌ పేరిట జూనియర్లను శారీరకంగా (Video Shows Sex Harassment) వేధించారు.దీనికి సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది

Representational Image | (Photo Credits: IANS)

Chennai, Nov 10: తమిళనాడులోని ఓ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్‌ పేరిట జూనియర్లను శారీరకంగా (Video Shows Sex Harassment) వేధించారు.దీనికి సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.వీడియోలో ఉన్న దాన్ని బట్టి చూస్తే జూనియర్‌ స్టూడెంట్స్‌ను కేవలం అండర్‌ వేర్‌పై నిలబెట్టి.. క్యాంపస్‌లోనే దారుణమైన పనులు చేయించారు. అర్థనగ్నంగా క్యాంపస్‌ రోడ్లపై రౌండ్లు వేయించడంతో పాటు బురదలో బస్కీలు, పుషప్స్‌ తీయించడం, వాటర్‌ పైపులతో నీళ్లను చల్లడం లాంటివి చేశారు. చేతికి దొరికిన వస్తువులను వాళ్ల మీదకు విసిరేశారు.

కుండల కొద్దీ ఫుల్లుగా నాటు సారా తాగి గ్రామస్తులకు చుక్కలు చూపించిన ఏనుగుల గుంపు, వాటిని అడవిలోకి పంపించేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చిందంటున్న స్థానికులు

మరోవైపు జూనియర్లను అర్థనగ్నంగానే ఒకరినొకరు కౌగిలించుకోవమని చెప్పడం, ప్రైవేట్‌ పార్ట్‌లపై కొట్టడం లాంటివి చేశాడు ఓ సీనియర్‌. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. కేసు నమోదు అయ్యింది. సీఎంసీ వెల్లూరు యాజమాన్యం.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, ఓ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Here's Video

మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సీనియర్లపై (7 Medical Students Suspended) వేటు పడింది. వెల్లూరు ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ర్యాగింగ్‌ వీడియో నిజమైందేనా? నకిలీదా? తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement