Uttarapradesh Shocker: ఎగ్జామ్‌లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి బాలికపై టీచర్ అత్యాచారం, రెండేళ్లుగా వాంఛ తీర్చుకుంటున్న కీచక టీచర్, ఎవరికైనా చెప్తే శ్రద్ధావాకర్ లాగా చంపేస్తానంటూ బెదింరిపులు

ఘజియాబాద్ జిల్లాలో కంప్యూటర్ టీచర్ సౌరభ్ గుప్తా(Saurabh Gupta) రెండేళ్ల క్రితం మార్కుల పేరుతో 9వ తరగతి విద్యార్థిని లోబరుచుకున్నాడు. అయితే ఆమె ఎదురు తిరిగినప్పుడల్లా ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. బాలికపై రెండేళ్లుగా అత్యాచారం (Rape) చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే శ్రద్ధా ఆఫ్తాబ్ ను హత్య చేసిన మాదిరిగానే ముక్కలుగా నరికి చంపుతానని బాలికను హెచ్చరించాడు.

Teacher Arrested For Raping Student Representative image

Lucknow, DEC 08: ఉత్తర ప్రదేశ్ లో విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ (Teacher) దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థినిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) ఆఫ్తాబ్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. ఆఫ్తాబ్ మాదిరిగా ఆమెను ముక్కలుగా నరుకుతానని బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ జిల్లాలో కంప్యూటర్ టీచర్ సౌరభ్ గుప్తా(Saurabh Gupta) రెండేళ్ల క్రితం మార్కుల పేరుతో 9వ తరగతి విద్యార్థిని లోబరుచుకున్నాడు. అయితే ఆమె ఎదురు తిరిగినప్పుడల్లా ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. బాలికపై రెండేళ్లుగా అత్యాచారం (Rape) చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే శ్రద్ధా ఆఫ్తాబ్ ను హత్య చేసిన మాదిరిగానే ముక్కలుగా నరికి చంపుతానని బాలికను హెచ్చరించాడు. కీచక టీచర్ హెచ్చరికతో బాలిక భయపడ్డారు. తనపై జరిగిన లైంగిక దాడితో పాటు అతడి బెదిరింపుల గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది.

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, యువకుడిని కిడ్నాప్ చేసి రూంలోకి తీసుకువెళ్లి బట్టలు ఊడదీసారు, అనంతరం దారుణంగా కొడుతూ వీడియో తీసారు, కేసు నమోదు చేసిన పోలీసులు 

దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్ సౌరభ్ గుప్తాపై పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కీచక టీచర్ ను అరెస్టు చేశారు. ఫెయిల్ చేస్తానని బెదిరించి పలువురు విద్యార్థినులను కూడా లొంగదీసుకున్నట్లు టీచర్ సౌరభ్ దర్యాప్తులో వెల్లడించారు. పోలీసులు సోమవారం అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. పోలీసులు సౌరభ్ గుప్తాను జైలుకు తరలించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement