Shopian Encounter: భారత్ - పాక్ సరిహద్దుల్లో మళ్ళీ పేలిన తూటా, ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, మరో చోట కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు, బీఎస్ఎఫ్ జవాన్ కు గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు. గురువారం తెల్లవారుజామున షోపియాన్‌లోని కతోహలెన్‌ ప్రాంతంలో (Kathohalen area) ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

Credits: Twitter

Srinagar, NOV 09: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు. గురువారం తెల్లవారుజామున షోపియాన్‌లోని కతోహలెన్‌ ప్రాంతంలో (Kathohalen area) ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.  అతడిని ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF) ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.

 

ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ఘటనలో రామ్‌గఢ్‌ సెక్టార్‌లోని (Ramgarh sector) అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ఓ జవాన్‌ గాయపడ్డారు.

 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్‌ (Pakistan) సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement