Unique ID Number Mandatory for Doctors in India: ఇకపై ఆ ఐడీ ఉంటేనే డాక్టర్‌గా గుర్తింపు, భారత్‌లో వైద్యులకు ప్రత్యేక గుర్తింపు నెంబర్లు ఇవ్వాలని నిర్ణయం, నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త నిబంధనలు
భారత్‌లోని డాక్టర్లు అందరికీ ఇకపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కొత్త నిబంధనల ప్రకారం, ఎన్‌ఎమ్‌సీ ఎథిక్స్ బోర్డు (NMC Board) ఈ సంఖ్యను జారీ చేస్తుంది. తద్వారా వైద్యుల పేర్లను జాతీయ మెడికల్ రిజిస్ట్రీలో నమోదుచేయడంతో పాటూ వారికి దేశంలో ప్రాక్టీసు చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. దేశంలోని ప్రతి వైద్యుడికి ఈ యూనీక్ ఐడీ నెంబర్ తప్పనిసరి
New Delhi, May 17: భారత్‌లోని డాక్టర్లు అందరికీ ఇకపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కొత్త నిబంధనల ప్రకారం, ఎన్‌ఎమ్‌సీ ఎథిక్స్ బోర్డు (NMC Board) ఈ సంఖ్యను జారీ చేస్తుంది. తద్వారా వైద్యుల పేర్లను జాతీయ మెడికల్ రిజిస్ట్రీలో నమోదుచేయడంతో పాటూ వారికి దేశంలో ప్రాక్టీసు చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. దేశంలోని ప్రతి వైద్యుడికి ఈ యూనీక్ ఐడీ నెంబర్ తప్పనిసరి (Unique ID Number Mandatory for Doctors in India). ఎన్ఎమ్‌సీ తాజాగా నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని వైద్యులందరి కోసం ఉమ్మడిగా ఓ నేషనల్ మెడికల్ రిజిస్టర్‌ను (National Medical Register) ఏర్పాటు చేస్తారు. ఇవే వివరాలతో మరో రిజిస్టర్ ఎథిక్స్ బోర్డు వద్ద కూడా ఉంటుంది.
రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్స్ వద్ద ఉన్న రిజిస్టర్లలోని వైద్యుల (Doctors) వివరాలన్నీ ఈ జాతీయ రిజిస్టర్‌లో చేరుస్తారు. వైద్యులకు సంబంధించి తగు వివరాల్ని ఈ రిజిస్టర్‌లో పొందుపరుస్తారు. రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకున్న వైద్యులకు 5 ఏళ్ల కాలపరిమితపై వైద్య వృత్తిని ప్రాక్టీసు చేసుకునేందుకు లైసెన్స్ జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వైద్యులు తమ లైసెన్స్ పునరుద్ధరణ కోసం స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరో మూడు నెలల్లో కాలపరిమితి ముగుస్తుందనంగా వైద్యులు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)