Niece Murderd for Mango: మామిడికాయ అడిగిందని చంపి గోనె సంచిలో కట్టేశాడు, మేనకోడలిని రాడ్డుతో కొట్టి చంపిన మేనమామ, ఉత్తరప్రదేశ్‌లో ఘటన

మేనమామ ఉమరుద్దీన్‌ ఇంటికి వెళ్లింది. భోజనం చేస్తున్న అతడ్ని మామిడి కాయ కావాలని పదే పదే అడిగింది. దాని కోసం మేనకోడలు (niece) మారాం చేసి విసిగించడంపై మేనమామ ఆగ్రహం చెందాడు. ఆ చిన్నారి తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. అనంతరం కత్తితో బాలిక గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని( Deadbody) గోనె సంచిలో కుక్కి ఇంట్లో దాచాడు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Shamli, July 24: మామిడి కాయ (Mango) కావాలని పదే పదే అడిగినందుకు ఒక బాలికను మేనమామ (Uncle) హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీ (Shamli)జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖేదా కుర్తాన్ (Kheda kurthan) గ్రామానికి చెందిన కూలీ కుమార్తె 5 ఏళ్ల ఖైరు నిషా, మంగళవారం మేనమామ ఉమరుద్దీన్‌ ఇంటికి వెళ్లింది. భోజనం చేస్తున్న అతడ్ని మామిడి కాయ కావాలని పదే పదే అడిగింది. దాని కోసం మేనకోడలు (niece) మారాం చేసి విసిగించడంపై మేనమామ ఆగ్రహం చెందాడు. ఆ చిన్నారి తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. అనంతరం కత్తితో బాలిక గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని( Deadbody) గోనె సంచిలో కుక్కి ఇంట్లో దాచాడు. మరోవైపు బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఉమరుద్దీన్‌ కూడా వారితో కలిసి వెతికేందుకు వెళ్లాడు. పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పారిపోయాడు.

Jarkhand Shocker: వైఫ్ తో గొడవ పెట్టుకుంటే నైఫ్ తో చెలాగాటమే, జీన్స్ వేసుకోనివ్వడం లేదని, కట్టుకున్న భర్తను కస కస పొడిచి చంపేసిన భార్య 

ఉమరుద్దీన్‌ ఇంట్లో సోదా చేసిన పోలీసులు గోనె సంచిలో ఉన్న బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం పారిపోయిన నిందితుడి కోసం గాలించారు. సమీప అటవీ ప్రాంతంలో ఉన్న ఉమరుద్దీన్‌ను గురువారం అరెస్ట్‌ చేశారు. బాలిక హత్యకు వినియోగించిన కత్తి, ఐరన్‌ రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement