UP Shocker: హిందూ యువతితో పారిపోయిన ముస్లిం యువకుడు, అతని తల్లిదండ్రులను దారుణంగా చంపేసిన యువతి కుటుంబసభ్యులు

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో (Sitapur) ఘోరం జరిగింది. అబ్బాస్‌, కమ్రూల్‌ నిషా అనే ముస్లిం దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కుమారుడు షౌకత్‌.. రూబీ అనే హిందూ బాలికను (Hindu Girl) తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం ఈ జంట హత్యలకు దారి తీసింది. రూబీ తండ్రి రాంపాల్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి షౌకత్‌ ఇంటిపై దాడి (Muslim Couple Beaten) చేశాడు.

Representational Image (Photo Credits: Pexels)

Lucknow, AUG 20: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో (Sitapur) ఘోరం జరిగింది. అబ్బాస్‌, కమ్రూల్‌ నిషా అనే ముస్లిం దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కుమారుడు షౌకత్‌.. రూబీ అనే హిందూ బాలికను (Hindu Girl) తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం ఈ జంట హత్యలకు దారి తీసింది. రూబీ తండ్రి రాంపాల్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి షౌకత్‌ ఇంటిపై దాడి (Muslim Couple Beaten) చేశాడు. ఇంట్లో ఉన్న అతని తల్లిదండ్రులను ఇనుప రాడ్‌లు, కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూబీ తండ్రి రాంపాల్‌ సహా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాగా, షౌకత్‌, రూబీ కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. దాంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రూబీ పేరెంట్స్‌ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 2020లో ఇద్దరూ లేచిపోయారు.

దీనిపై రూబీ (Ruby) తండ్రి రాంపాల్‌ (Rampal) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికి రూబీ మైనర్‌ కావడంతో పోలీసులు షౌకత్ అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన షౌకత్‌.. ఇప్పుడు రూబీ మేజర్‌ కావడంతో మరోసారి లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన రూబీ కుటుంబసభ్యులు షౌకత్‌ పేరెంట్స్‌పై దాడి చేసి హతమార్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement