IPL Auction 2025 Live

UP Rape Shocker:మనుషులు కాదు మృగాళ్లు..యూపీలో అత్యంత దారుణంగా మహిళను రేప్ చేసిన కామాంధులు, మళ్లీ నిర్భయ లాంటి ఘటన, నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

నడి వయస్కురాలైన మహిళపై కామాంధులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈనెల 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం నివేదికలో (Post-Mortem Report) వెల్లడైన విషయాలు మృగాళ్ల క్రూరత్వానికి అద్దం పడుతున్నాయి.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Lucknow, January 6: ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన (UP Rape Shocker) చోటుచేసుకుంది. నడి వయస్కురాలైన మహిళపై కామాంధులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈనెల 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం నివేదికలో (Post-Mortem Report) వెల్లడైన విషయాలు మృగాళ్ల క్రూరత్వానికి అద్దం పడుతున్నాయి.

వివరాల్లోకెళితే.. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో మేవాలి గ్రామంలో ఆదివారం రాత్రి 50 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రైవేటు భాగాల్లో ఐరన్‌ రాడ్డుతో దాడి చేసి.. పక్కటెముకలు, కాలు విరిగేలా పశువుల్లా (Her Private Parts Injured) ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితురాలి ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కన్నుమూసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులు హంత్‌ బాబా సత్యనారాయణ, అతడి అనుచరుడు వేద్‌రాం, డ్రైవర్‌ జస్పాల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కనుగొనేందుకు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. బదూన్‌ ఎస్‌ఎస్పీ సంకల్ప్ శర్మ ఘటనాస్థలిని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేసి, శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిర్భయ తరహాలో అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటనను యూపీ పోలీసులు తీవ్రంగా తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ 302, 376 డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆ నలుగురే దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు, హత్రాస్ రేప్ ఘటనపై చార్జిషీట్‌‌ ఫైల్ చేసిన సీబీఐ, సీబీఐ విచారణను పర్యవేక్షిస్తున్న అలహాబాద్‌ హైకోర్టు

ఈ కేసులో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశామని ఎస్పీ శర్మ చెప్పారు. నిందితులు మహిళ మృతదేహాన్ని అర్దరాత్రి 12 గంటలకు ఇంటి బయట వదిలి పరారయ్యారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేర మహంత్ బాబా సత్యనారాయణ, అతని శిష్యుడు వేద్రామ్, డ్రైవరు జస్పాల్ లపై కేసు నమోదు చేశామని, ఇందులో ఒకరిని అరెస్టు చేశామని ఎస్పీ శర్మ వివరించారు.

Three persons including the priest booked under sections of gang rape & murder

ఇదిలా ఉంటే ఆలయ పూజారి, అతని ఇద్దరు శిష్యులతో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సోమవారం ఉదయం మహిళ ఇంటి నుండి వచ్చిన చిత్రాలు ఆమె మృతదేహాన్ని ఒక మంచం మీద పడుకోబెట్టినట్లు, కుటుంబ సభ్యులు మరియు ఇతర గ్రామస్తులు ఆమె చుట్టూ ఉన్నట్లుగా ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమె దిగువ శరీరాన్ని కప్పి ఉంచే పసుపు షీట్ రక్తంతో తడిచినట్లుగా కనిపిస్తోంది. ఆమె కాళ్ళలో ఒకటి విరిగి పోయినట్లుగా తెలుస్తోంది.

హత్రాస్ అత్యాచార బాధితురాలు మృతి, దారుణంగా హింసించి గ్యాంగ్ రేప్, నిందితులను అరెస్టు చేశామని తెలిపిన హత్రాస్ పోలీసు అధికారి, పోలీసులు పట్టించుకోలేదని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపణ

ఇదిలా ఓ ఉంటే ఈ ఘటనపై పూజారి వీడియో బయటకు వచ్చింది. ఆయన వీడియోలో చెబుతున్న వివరాల ప్రకారం.. ఆ మహిళ ప్రార్థనా స్థలానికి సమీపంలో ఉన్న బావిలో పడిపోయిందని..నేను మరో ఇద్దరం ఆమెను రక్షించామని.. బావి నుండి బయటకు తీసినప్పుడు ఆమె సజీవంగా ఉందని ఇంటిదగ్గర వదిలివేశామని చెబుతున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ ఎవరు చెప్పారనే దానిపై స్పష్టత లేదు.

మహిళ కుమారుడు సోమవారం మధ్యాహ్నం స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా అమ్మ క్రమం తప్పకుండా ప్రార్థనా స్థలానికి వెళ్లేది." ఆదివారం, ఆమె సాయంత్రం 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరింది మరియు రాత్రి 11:30 గంటలకు పురుషులు ఆమెను ఇంటికి తిరిగి తీసుకువచ్చారు, "ఆమె కుమారుడు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

ఇక బుడాన్ పోలీసులు చేసిన ట్వీట్‌లో సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదైందని, ఇద్దరు అరెస్టులు జరిగాయని చెప్పారు. బుడాన్ పోలీసు చీఫ్ సంకల్ప్ శర్మ కూడా ఇద్దరు అరెస్టులను ధృవీకరించారు. నిర్లక్ష్యం చేసినందుకు స్థానిక పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.



సంబంధిత వార్తలు