Hathras rape victim cremated on Wednesday | (Photo Credits: PTI)

Lucknow, December 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై (Hathras Gangrape Case) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్‌‌ ఫైల్ చేసింది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) (Central Bureau of Investigation (CBI) చార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఆమెను చిత్రహింసలకు గురిచేసి మృతికి కారణమైన వారిపై, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, సామూహిక అత్యాచారం కింద అభియోగాలు నమోదు చేసింది.ఈ నలుగురే బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌‌కు పాల్పడినట్లు, మర్డర్ చేసినట్లు చార్జిషీట్‌‌లో సీబీఐ పేర్కొంది. వీరిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద.. సెక్షన్లు 354, 376 ఏ, 376 డీ, 302 ప్రకారం చార్జి‌షీట్ పెట్టింది.బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

కాగా ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు హత్రాస్ బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి (2020 Hathras gang rape and murder) పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లి బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

హత్రాస్ అత్యాచార బాధితురాలు మృతి, దారుణంగా హింసించి గ్యాంగ్ రేప్, నిందితులను అరెస్టు చేశామని తెలిపిన హత్రాస్ పోలీసు అధికారి, పోలీసులు పట్టించుకోలేదని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపణ

దీంతో పాటు బాధితురాలి అత్యంత దయనీయ పరిస్థితిలో మరణించడం, మృతదేహానికి పోలీసులే అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. సెప్టెంబర్ 14న హత్రాస్‌‌లో ఈ ఘటన (Hathras Case) జరగగా.. అదే నెల 29న బాధితురాలు చనిపోయింది. యువతి అంత్యక్రియల విషయంలో త్వరగా నిర్వహించాలని తమను లోకల్ పోలీసులు బెదిరించారని ఆమె కుటుంబీకులు ఆరోపించారు.

బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు, హాథ్రస్ ఘటనలో దారుణ విషయాలు వెలుగులోకి, అత్యాచారం జరిగినట్లుగా ధృవీకరించిన పోస్ట్ మార్టం నివేదిక

ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ తర్వాత సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణను అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తోంది.