Gang Rape On Boy: ఐదేండ్ల బాలుడిపై గ్యాంగ్‌ రేప్‌.. సోషల్ మీడియాలో వీడియో.. పరారీలో నిందితులు

ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు.

Andhra Pradesh Shocker, women gang-raped in front of husband

Newdelhi, Sep 30: పసిమొగ్గలపై అత్యాచార ఘటనలు దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక (Gang Rape On Boy), ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో (Social Media) పోస్ట్‌ చేశారు. ఈ దారుణ ఘటన యూపీలోని హాపూర్‌ లో చోటుచేసుకుంది. హాపూర్‌ లో ఈనెల 19న బాధిత బాలుడు నిద్రిస్తున్నాడు. అయితే, వేకువజామున మూడు గంటలకు జునైద్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బాలుడిని ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి మరో ముగ్గురు కలిశారు. వారిలో ఇద్దరు బాలుడిపై లైంగిక దాడి చేయగా, మిగిలిన ఇద్దరూ దానిని వీడియో తీశారు. ఈ మేరకు బాధిత బాలుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం.. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేసిన యువకుడు (వీడియో)

అంతటితో ఆగకుండా..

బాలుడిపై అకృత్యాన్ని వీడియోగా తీసిన నిందితులు అంతటితో ఆగకుండా దాన్ని సామాజిక మాధ్యమంలో అప్‌ లోడ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి లైంగిక దాడి చేసిన ఇద్దరు, దానిని వీడియో తీసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

వామ్మో, కారు డోర్ ఓపెన్ చేయగానే పైకి దూసుకొచ్చిన 8 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే...