UP Shocker: ఇతరులతో గే సెక్స్‌కు అలవాటు పడిన లా విద్యార్థి, ఆ దృశ్యాన్ని వీడియో తీసి డబ్బులు బ్లాక్ మెయిల్, తట్టుకోలేక అతన్ని చంపేసిన సహచర గేలు, యూపీలో దారుణ ఘటన
అసహజ సంబంధం నేపథ్యంలో లా చదువుతున్న యువకుడు హత్యకు ( Law student killed by gay partner) గురయ్యాడు. దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారులోని ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో Uttar Pradesh) ఈ సంఘటన జరిగింది. మీరట్‌కు చెందిన 22 ఏళ్ల యాష్ రస్తోగి ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు.
Lucknow, July 4: యూపీలో దారుణం చోటు చేసుకుంది. అసహజ సంబంధం నేపథ్యంలో లా చదువుతున్న యువకుడు హత్యకు ( Law student killed by gay partner) గురయ్యాడు. దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారులోని ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో Uttar Pradesh) ఈ సంఘటన జరిగింది. మీరట్‌కు చెందిన 22 ఏళ్ల యాష్ రస్తోగి ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. జూన్ 26న స్కూటీపై ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. దీంతో యాష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. యాష్ మొబైల్ లొకేషన్ ఆధారంగా అతడి స్నేహితులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పోలీసులు ఆ ముగ్గురిని ప్రశ్నించగా వారంతా గే గ్యాంగ్‌గా తెలిసింది. యాష్‌తో అసహజ సంబంధం ఉందని వారు తెలిపారు. అయితే యాష్ వారి చర్యను వీడియో తీసి బెదిరించినట్లు ఆరోపించారు. రూ.40,000 వసూలు చేసిన యాష్, మరిన్ని డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశాడని (deceased was blackmailing him) చెప్పారు. దీంతో యాష్‌ను లిసాడి గేట్ ప్రాంతానికి పిలిపించి మాట్లాడామని, ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో అతడ్ని హత్య చేసినట్లు తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో మూటగట్టి మురికి కాల్వలో పడేసినట్లు వెల్లడించారు. మరోవైపు శనివారం రాత్రి ఢిల్లీలోని సాదిక్ నగర్ ప్రాంతంలోని మురికి కాలువలో గోనె సంచిలో ఉన్న యాష్ మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.