Uttar Pradesh Crime: యూపీలో దారుణం.. గొడవలో నా ప్రైవేట్ పార్ట్ కొరికిందని భర్త.. నా ముక్కు కొరికాడని భార్య పరస్పర ఫిర్యాదు.. ఇద్దరి వాదనలపై పోలీసుల దర్యాప్తు..

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లా సాండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముంషీగంజ్ ప్రాంతంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన తీవ్ర వివాదం పరస్పరం దాడులు చేసుకునేంత దారుణంగా మారింది.

Crime | Representative Image (Photo Credit: Pixabay)

Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లా సాండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముంషీగంజ్ ప్రాంతంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన తీవ్ర వివాదం పరస్పరం దాడులు చేసుకునేంత దారుణంగా మారింది. తన భర్త తనపై దాడి చేసి ముక్కు కొరికాడని భార్య ఆరోపించగా, భార్యే తన కుమారుడి ప్రైవేట్ భాగంపై దాడి చేసిందని అత్త ఎదురుదాడికి దిగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంషీగంజ్‌కు చెందిన వాహన డ్రైవర్ దీపక్‌కు సాధన (27)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిది, ఆరు, మూడేళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్ని నెలలుగా వీరి మధ్య కుటుంబ తగాదాలు నడుస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితం సాధన ఇంటి నుంచి వెళ్ళిపోగా.. ఆ సమయంలో పోలీసుల సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే, గురువారం సాధన తిరిగి రావడంతో దంపతుల మధ్య మళ్ళీ ఘోరమైన గొడవ ప్రారంభమైంది.

వీడియోలు ఇవిగో.. స్పా సెంటర్ లోపలకు వెళ్లిన పోలీసులు.. అక్కడ న్యూడ్ సీన్లు చూసి ఒక్కసారిగా షాక్.. గురుగ్రామ్‌లో 18 స్పా కేంద్రాలపై ఒకేసారి దాడులు..

గొడవ సమయంలో తన అత్తమామలు చేతులు పట్టుకోగా, భర్త దీపక్ తన తలపై కొట్టి దంతాలతో ముక్కును కొరికి కాలువలో పడేశాడని సాధన తీవ్ర ఆరోపణలు చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు మొదట సాండీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హర్దోయీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.

మరోవైపు, ఈ ఆరోపణలను సాధన అత్త ఖండించింది. సాధన తిరిగి వచ్చి పిల్లలను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ గొడవ జరిగిందని తెలిపింది. ఆ క్రమంలో సాధన తన కుమారుడు దీపక్ ప్రైవేట్ భాగంపై దంతాలతో తీవ్రంగా దాడి చేసిందని, అనంతరం పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తనను తాను గాయపరుచుకుందని ఆరోపించింది.

ఈ దారుణ ఉదంతంపై కేసు నమోదు చేసిన సాండీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పుష్పరాజ్, భర్త దీపక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. భార్య నుంచి ఇంకా రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, అత్త ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఇరువర్గాల పరస్పర ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement