Uttar Pradesh Horror: యువతిని దారుణంగా కొడుతూ గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు, కాలేజ్ విద్యార్ధిని ఇంటికి తిరిగి వెళుతుండగా తెగబడిన ముగ్గురు కామాంధులు, ఇద్దరు నిందితులు అరెస్ట్
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు (Uttar Pradesh Horror) కొనసాగుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఫిరోజాబాద్‌లోని తుండ్లా ప్రాంతంలో 22 ఏండ్ల పీజీ కాలేజ్ విద్యార్ధిని (22-Year-Old College Student ) ఇంటికి తిరిగి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి (Gang-Raped by 3 in Firozabad) తెగబడ్డారు.
Lucknow, Mar 8: యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు (Uttar Pradesh Horror) కొనసాగుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఫిరోజాబాద్‌లోని తుండ్లా ప్రాంతంలో 22 ఏండ్ల పీజీ కాలేజ్ విద్యార్ధిని (22-Year-Old College Student ) ఇంటికి తిరిగి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి (Gang-Raped by 3 in Firozabad) తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో బాధితురాలిని దుండగులు తీవ్రంగా కొట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని ఫోన్‌లో రికార్డు చేశారు.
ఆగ్రా నుంచి తాను ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని బాధితురాలు తెలిపింది. ఆటోలో ఇతర ప్రయాణీకులున్నారని వారు కుబేర్‌పూర్ బ్రిడ్జి వద్ద దిగిపోయారని వెల్లడించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులకు గాను ఇద్దరిని అరెస్ట్ చేశామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆగ్రా ఎస్‌పీ సత్యజిత్ గుప్తా వెల్లడించారు. అరెస్ట్ చేసిన సమయంలో నిందితులు మద్యం సేవించి ఉన్నారని చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురిపై సెక్షన్‌లు 376-డి (గ్యాంగ్ రేప్), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు) మరియు 394 (దోపిడీ చేయడంలో స్వచ్ఛందంగా గాయపరచడం) సెక్షన్‌ల కింద అభియోగాలు మోపారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC).