Lucknow, Mar 8: ఆడపిల్లలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో జరిగిన ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. యూపీలోని అలీఘఢ్‌లో 9 ఏండ్ల మేనకోడలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి (Man Rapes 9-Year-Old) పాల్పడి హత్య చేసిన ఉదంతం వెలుగుచూసింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నిందితుడు బాధితురాలిని ఇటుకతో మోది హత్య (Bludgeons Her to Death With Brick) చేసి ఆపై మృతదేహాన్ని వుడెన్ గోడౌన్ వెనుక దాచాడు. ఇగ్లస్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బాధితురాలితో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లను స్నాక్స్ (Luring Her with Snacks) ఇప్పిస్తానని బయటకు తీసుకువెళ్లాడు. ఆపై ఇద్దరు బాలికలను ఇంటికి పంపిన నిందితుడు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. స్నాక్స్ కొనిస్తానని అంకుల్ తమను బయటకు తీసుకువెళ్లాడని బాలికలు చెప్పడంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటుక రాయితో నిందితుడు బాలికను కొట్టడంతో ఆమె మరణించిందని ఎస్‌హెచ్ఓ రిపుదమన్ సింగ్ చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు మద్యానికి బానిసయ్యాడని, మద్యం మత్తులో జోగుతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిందితుడు కూడా బాలిక కనిపించలేదని తల్లిదండ్రులతో కలిసి వెతకడం. బాధితురాలి కుటుంబ సభ్యులను పక్కదారి పట్టించేందుకు నిందితుడు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వెతికించాడు.