IPL Auction 2025 Live

Uttar Pradesh: వాడు మనిషేనా..ఏడాదిన్నర పసిపాపని వదలని కామాంధుడు, నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారం,యూపీలో నిందితుడుని అరెస్ట్ చేసిన పోలీసులు, తప్పించుకుని వెళ్తుండగా కాల్పులు

ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

Representational image (Photo credits: ANI)

Bahraich, June 23: యూపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల తెలిపిన కథనం ప్రకారం.. ఏడాదిన్నర వయసున్న చిన్నారి సోమవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. ముప్పయ్యేళ్ల వయసున్న నిందితుడు ఆమెను రహస్యంగా ఎత్తుకెళ్లాడు.

సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న పాఠశాల భవనంలోకి తీసుకెళ్లి ఊహ తెలియని ఆ పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం నిద్ర లేవగానే తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించకపోవడంతో గ్రామస్థులతో కలిసి పాపకోసం వెతకడం ప్రారంభించారు. సమీపంలోని పాఠశాల భవనంలో తీవ్ర రక్తస్రావంతో అచేతనంగా పడి ఉన్న చిన్నారిని కనుగొన్నారు. చిన్నారి దారుణ పరిస్థితుల్లో అలాగే పడి ఉండటం చూసిన చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

కర్నూలులో దారుణం, కరోనా మనస్తాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, కృష్ణా జిల్లాలో విషాదంగా మారిన ముగ్గురు చిన్నారుల అదృశ్యం

అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకొని గ్రామస్థులు చితకబాదారు. అనంతరం అతడిని (Rape Accused) పోలీసులకు అప్పగించారు. అత్యాచారానికి గురైన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కోర్టులో హాజరుపరిచేందుకు (Police Custody in Bahraich) తీసుకెళ్తుండగా.. అతడు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని లొంగిపొమ్మని హెచ్చరిస్తూ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా పరుగు ఆపకపోవడంతో తుపాకీతో కాల్చారు. నిందితుడి కాలికి గాయమైంది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.