Uttar Pradesh Shocker: ప్రియుడితో నగ్నంగా రూంలో అక్క ఉండగా చూసిన తమ్ముడు, తల్లిదండ్రులకు చెబుతానని బెదిరింపు, భయపడి కొడవలితో యువకుడి గొంతు కోసిన లవర్స్

ప్రియుడితో శృంగారంలో మునిగి తేలిన అక్కను తమ్ముడు చూడటంతో అతన్ని ఇద్దరూ కలిసి కొడవలితో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటనలో యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sickle (Photo Credit: Pixabay)

Rae Bareli, February 16: యూపీలో దారుణ ఘటన (Uttar Pradesh Shocker) చోటు చేసుకుంది. ప్రియుడితో శృంగారంలో మునిగి తేలిన అక్కను తమ్ముడు చూడటంతో అతన్ని ఇద్దరూ కలిసి కొడవలితో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటనలో యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 ఏళ్ల బాలుడు తన సోదరిని, ఆమె ప్రియుడిని అభ్యంతరకరమైన స్థితిలో (Caught in Compromising Position) చూశాడు, దాని గురించి వారి తల్లిదండ్రులకు తెలియజేస్తానని బెదిరించాడు. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరూ కొడవలితో బాలుడి గొంతు ( Boyfriend Kill Minor Brother) కోశారు.

ఈ వారం ప్రారంభంలో జిల్లాలోని భడోఖర్ ప్రాంతంలోని అతని ఇంటి సమీపంలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందిచారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి. రాయ్‌బరేలీ పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ ప్రియదర్శి మాట్లాడుతూ, "బాలుడి తల్లిదండ్రులు ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లడంతో, స్థానిక నివాసితులు హత్య గురించి పోలీసులకు సమాచారం అందించారు, విచారణలో మేము అడిగిన ప్రశ్నలకు అతని సోదరి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.

ఢిల్లీలో మరో దారుణం, స్నేహితుడి బైక్ కోసం వెళితే 10 మంది కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు, పోలీసులకు చెబితే పట్టించుకోలేదని తెలిపిన మృతుని మేనమామ

ఒక మహిళా పోలీసు అధికారిని తనను ప్రశ్నించమని అడిగినప్పుడు, స్థానిక యువకుడు తన ఇంట్లో దోపిడీకి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. యువకుడికి డబ్బు రాకపోవడంతో అతను వారిపై దాడి చేసి తన సోదరుడిని చంపాడని ఆమె పేర్కొంది" అని ఎస్పీ చెప్పారు. పోలీసులు మహిళ పేర్కొన్న యువకుడిని విచారణ చేయగా.. అతను సంఘటన సమయంలో లక్నోలో ఉన్నాడని తేలింది, ఇది అతని మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా ధృవీకరించారు.

బతికి ఉన్న చేపను పట్టుకొచ్చిన వెయిటర్, కస్టమర్ చాప్‌స్టిక్‌లను కొరకడంతో షాక్ తిన్న పుడ్ ఆర్డర్ యజమాని, వీడియో సోషల్ మీడియాలో వైరల్

"వేరొక వెర్షన్‌ను వివరించిన సోదరిని మేము మళ్లీ ప్రశ్నించాము. స్పాట్ సమీపంలో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ ఫోన్‌లు తనిఖీ చేశాము" అని అధికారి చెప్పారు. ఎస్‌హెచ్‌ఓ, భదోఖర్, రాజేష్ సింగ్ మాట్లాడుతూ, "మేము రెండు నంబర్‌లను తనిఖీ చేశాము, రెండూ మరొక యువకుడివని గుర్తించాము, అతను తరచూ అమ్మాయిని కలుసుకునేవాడని మాకు తెలిసిందని తెలిపారు.సైబర్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పోలీసు బృందం ఇంట్లో సోదాలు చేసి రక్తంతో తడిసిన గుడ్డలో చుట్టిన కొడవలిని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్, కొడవలి గురించి సోదరిని ప్రశ్నించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది.