Uttar Pradesh Shocker: మొన్న గిరిజన యువకుడిపై మూత్రం పోశారు, నేడు యూపీలో దళిత యువకుడితో చెప్పులు నాకించారు, షాకింగ్ వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో దళిత కులానికి చెందిన వ్యక్తిని బలవంతంగా ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి చెప్పులు నాకించుకున్న ఘటన చోటు చేసుకుంది.

Twitter

మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన వ్యక్తిపై  అగ్రకులానికి చెందిన దురహంకార రాజకీయ నేత మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన మరువకముందే ఉత్తర ప్రదేశ్ లో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.  ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో దళిత కులానికి చెందిన వ్యక్తిని బలవంతంగా ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి చెప్పులు నాకించుకున్న ఘటన చోటు చేసుకుంది.  ఈ మొత్తం ఘటనను నిందితుడి సహచరుడు కెమెరాలో బంధించగా, వీడియో వెంటనే వైరల్‌గా మారింది. దళిత వ్యక్తిని అవమానించిని నిందితుడిని తేజ్‌బాలీ సింగ్ గా గుర్తించారు. నిందితుడు విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement