Uttar Pradesh Shocker: నడిరోడ్డు మీద తల లేని బాలిక మృతదేహం, షాకయిన పాదాచారులు, యూపీలో దారుణ ఘటన వెలుగులోకి

ఉత్తర ప్రదేశ్ లోని మీర‌ట్‌లో రోడ్డుపైన త‌లలేని బాలిక మృత‌దేహం (Headless Body of Young Woman) ఉండటం క‌ల‌కలం రేపింది. మీరట్ న‌గ‌రంలోని ల‌ఖిపుర ప్రాంతంలో శుక్ర‌వారం బాలిక మృత‌దేహం క‌నిపించ‌గా (Found in Drain in Meerut District) బాధితురాలి వ‌య‌సు 20-22 ఏండ్లు ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Merut, August 12: ఉత్తర ప్రదేశ్ లోని మీర‌ట్‌లో రోడ్డుపైన త‌లలేని బాలిక మృత‌దేహం (Headless Body of Young Woman) ఉండటం క‌ల‌కలం రేపింది. మీరట్ న‌గ‌రంలోని ల‌ఖిపుర ప్రాంతంలో శుక్ర‌వారం బాలిక మృత‌దేహం క‌నిపించ‌గా (Found in Drain in Meerut District) బాధితురాలి వ‌య‌సు 20-22 ఏండ్లు ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీస్ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.ఈ ఘ‌ట‌న లిసారి గేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింద‌ని పోలీసులు చెబుతున్నారు. బాలిక‌ను వేరొక ప్రాంతంలో హ‌త్య చేసిన అనంత‌రం మృత‌దేహాన్ని ల‌ఖిపుర ప్రాంతంలో ప‌డేసి ఉంటార‌ని పోలీస‌లు అధికారులు భావిస్తున్నారు.

ఢిల్లీలో బరితెగించిన కామాంధుడు, ముగ్గురి బాలికలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి, కేసు పూర్తి వివరాలు వెల్లడించాలని పోలీసులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్

ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. ఘ‌ట‌న స‌మాచారం అంద‌గానే అక్క‌డికి చేరుకున్న పోలీసులు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టారు.ఫోరెన్సిక్ బృందం కూడా ఘ‌ట‌నా స్ధలానికి చేరుకుంది. బాలిక త‌ల ఎక్క‌డవుందో ఇప్ప‌టివ‌ర‌కూ పోలీసులు గుర్తించ‌లేదు. అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో త‌ప్పిపోయిన బాలిక‌ల వివ‌రాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలిక‌ను గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement