Pramod Muthalik: 10 మంది ముస్లిం యువతులను ట్రాప్‌లోకి దించండి, హిందూ యువ‌కులు ఆ పని చేస్తే భ‌ద్ర‌త‌,ఉపాధి క‌ల్పిస్తాం, శ్రీరామ్ సేన చీఫ్ ప్ర‌మోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్య‌లు

క‌ర్నాట‌క‌లోని బాగ‌ల్కోట్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో శ్రీరామ్ సేన చీఫ్ ప్ర‌మోద్ ముతాలిక్ (Pramod Muthalik) సంచలన వ్యాఖ్య‌లు చేశారు.లవ్ జిహాద్ కు స్పందనగా ఒక్కో హిందూ యువతికి బదులుగా పది మంది ముస్లిం అమ్మాయిలను ట్రాప్ (Trap 10 Muslim girls) చేయాలని పిలుపునిచ్చారు.

Sri Ram Sene Chief Pramod Muthalik (Photo Credits: PTI)

Bengaluru, Feb 20: క‌ర్నాట‌క‌లోని బాగ‌ల్కోట్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో శ్రీరామ్ సేన చీఫ్ ప్ర‌మోద్ ముతాలిక్ (Pramod Muthalik) సంచలన వ్యాఖ్య‌లు చేశారు.లవ్ జిహాద్ కు స్పందనగా ఒక్కో హిందూ యువతికి బదులుగా పది మంది ముస్లిం అమ్మాయిలను ట్రాప్ (Trap 10 Muslim girls) చేయాలని పిలుపునిచ్చారు.ల‌వ్ జిహాద్‌కు దీటుగా బ‌దులిచ్చేందుకు హిందూ యువ‌కులు ముస్లిం యువ‌తుల‌కు వ‌ల వేయాల‌ని ప్ర‌మోద్ ముతాలిక్ పిలుపు ఇచ్చారు. ఇలా చేసిన‌వారికి తాము భ‌ద్ర‌త‌, ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఆయ‌న భ‌రోసా (Pramod Muthalik tells youths) ఇచ్చారు.

మనకు పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఈ సందర్భంగా హిందూ యువతను నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. మనం ఒక హిందూ యువతిని నష్టపోతే.. కనీసం 10 మంది ముస్లిం అమ్మాయిలను ఆకర్షించాలి. అలా చేస్తే శ్రీరామ్ సేన మీ రక్షణ బాధ్యతను తీసుకుంటుంది. ఉపాధి కల్పిస్తుంది. లవ్ జిహాద్ తో మన అమ్మాయిలు దోపిడీకి గురవుతున్నారు.

మా నుంచి అన్నీ దొంగిలించినా ఠాక్రే పేరును మాత్రం దొంగిలించలేరు, మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి ఆపకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఉద్ధవ్ థాకరే

దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. మన చర్యలతో వారిని హెచ్చరించాలి’’ అని ముతాలిక్ వ్యాఖ్యానించారు. త‌న‌పై 109 కేసులు న‌మోద‌య్యాయ‌ని, వీటిలో అధిక శాతం బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే న‌మోద‌య్యాయ‌ని గ‌త వారం ముతాలిక్ చెప్పారు.

Here's Video

హిందుత్వ‌పై త‌న వైఖ‌రికి పార్టీ నుంచే అడ్డంకులు ఎదురువుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో అవినీతికి వ్య‌తిరేకంగా హిందుత్వ కోసం శ్రీరామ్ సేన పోరాడుతుంద‌ని పేర్కొన్నారు. కాగా ఉడిపి జిల్లాలోని క‌ర్క‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు ముతాలిక్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ నియోజ‌క‌వర్గానికి ప్ర‌స్తుతం రాష్ట్ర మంత్రి వి. సునీల్ కుమార్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. క‌ర్క‌ల ఎమ్మెల్యే సునీల్‌ కుమార్ అవినీతి ఆరోప‌ణ‌ల్లో కూరుకుపోయాని ముతాలిక్ విమ‌ర్శ‌లు గుప్పించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో మ‌రోసారి బండి సంజ‌య్, ఇంత‌కీ వార్త‌ల‌పై సంజ‌య్ ఏమ‌న్నారంటే?

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం