Voter List Update 2026: ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SSR.
భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సారాంశ సవరణ' (Special Summary Revision - SSR) ప్రక్రియను చేపడుతున్నట్లు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Voter List Update 2026: భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సారాంశ సవరణ' (Special Summary Revision - SSR) ప్రక్రియను చేపడుతున్నట్లు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన సవరణ ప్రక్రియకు అర్హత పొందే ప్రధాన గడువు తేదీగా 2027 జనవరి 1ని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందే యువత, తొలిసారి ఓటు వేసే అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో సమర్థవంతంగా నమోదు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న రికార్డులను అత్యంత పారదర్శకంగా నవీకరించడమే ఈ బృహత్తర ప్రక్రియ ప్రధాన ధ్యేయం. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ' (Special Intensive Revision - SIR)పై ప్రతిపక్షాల నిరసనలు, తీవ్ర రాజకీయ వివాదం కొనసాగుతుండటం, సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ స్పష్టమైన ప్రకటన వెలువడటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేం.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
ఓటర్ల జాబితాలు అత్యంత ఖచ్చితంగా, నిష్పాక్షికంగా ఉండేలా చూసేందుకు ఎన్నికల సంఘం క్రమం తప్పకుండా నిర్వహించే ఒక నియమిత ప్రక్రియే ఈ 'ప్రత్యేక సారాంశ సవరణ' (SSR). ఈ విధానం ద్వారా అర్హులైన పౌరులందరినీ జాబితాలో చేర్చడం, మరణించిన వారు, నివాసాలు మారిన వారి పేర్లను తొలిగించడం , తప్పుగా నమోదైన వివరాలను సరిదిద్దడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కోసం ఈసీ సమగ్ర కాలపట్టికను కూడా ఖరారు చేసింది.
నవంబర్ 2, 2026 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేసి, నవంబర్ 12న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 12 వరకు కొత్త పేర్ల నమోదు, దిద్దుబాట్లు, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించి, డిసెంబర్ 28 నాటికి వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తారు. అనంతరం జనవరి 4, 2027న అంతిమ ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. కొత్తగా అర్హత పొందే పౌరులు జనవరి 1, 2027 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉంటే, ఫారం 6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది.
స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) , స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం వాటి నిర్వహణ పరిధిలోనే ఉంది. సాధారణంగా సమ్మరీ రివిజన్ (SSR) అనేది పాత జాబితాను ప్రాతిపదికగా తీసుకుని, పౌరులు అందించే దరఖాస్తుల ఆధారంగా మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ. కానీ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది బూత్ స్థాయి అధికారులు (BLO) స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను క్షుణ్ణంగా సేకరించి కొత్తగా రికార్డులను సృష్టించే విస్తృత ప్రక్రియ. ఇటీవల SIR ప్రక్రియలో లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారంటూ సీజేపీ, ఇండియా కూటమి తదితర ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం , నిరసనలు ఉధృతం చేయడం పాఠకులకు తెలిసిన విషయమే.
ఎన్నికల సంఘం తాజా ఆదేశాల ప్రకారం ఈ ప్రత్యేక సవరణ డ్రైవ్ అండమాన్ , నికోబార్ దీవులు, అస్సాం, బీహార్, ఛత్తీస్గద్ధ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ , పశ్చిమ బెంగాల్లలో అమలుకానుంది. ఇప్పటికే SIR ప్రక్రియ పురోగతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్లకు ప్రత్యేకాధికారాలతో షెడ్యూల్ను విడిగా ప్రకటిస్తామని తెలిపింది. 2027 ప్రారంభంలోనే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ 17 రాష్ట్రాలలో సకాలంలో ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకంగా మారింది.