West Bengal Shocker: శాడిస్టు భర్త.. పార్టీలో స్నేహితులకు భార్యను అప్పగించాడు, భర్తతో సహా అందరూ దారుణంగా ఆమెపై అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. క‌ట్టుకున్న భార్య‌పై భ‌ర్త‌తో పాటు అత‌డి స్నేహితులు ఇద్ద‌రు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. చికిత్స కోసం బిహార్‌లోని నెవాడ నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చిన మ‌హిళ‌పై భ‌ర్త ప్రోద్బ‌లంతో ఈ సామూహిక లైంగిక దాడి (20-year-old woman gang-raped) జ‌రిగింది.

Image used for representational purpose only. (Photo Credits: ANI)

Kolkata, Mar 7: ప‌శ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. క‌ట్టుకున్న భార్య‌పై భ‌ర్త‌తో పాటు అత‌డి స్నేహితులు ఇద్ద‌రు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. చికిత్స కోసం బిహార్‌లోని నెవాడ నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చిన మ‌హిళ‌పై భ‌ర్త ప్రోద్బ‌లంతో ఈ సామూహిక లైంగిక దాడి (20-year-old woman gang-raped) జ‌రిగింది. భ‌ర్త స‌హా నిందితుల‌పై మ‌హిళ ఫిర్యాదు చేయ‌డంతో ఈ దారుణం (West Bengal Shocker) బ‌య‌ట‌కువ‌చ్చింది.

మ‌హిళ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌హిళ ఇంట్లో మార్చి 3న పార్టీ జ‌రిగిన క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాసిపోర్ రోడ్డు ప్రాంతంలోని అత్తగారింట్లో మ‌హిళ భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తోంది. నిందితుడితో బాధితురాలికి రెండేండ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. ప‌ధ‌కం ప్ర‌కారం భ‌ర్త‌తో పాటు ఇద్ద‌రు స్నేహితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి (husband, his 2 friends in Kolkata ) పాల్ప‌డ్డార‌ని ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు. మ‌హిళ‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంతరం ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

ప్రిన్సిపల్ కాదు కామాంధుడు, క్లాస్ రూంలో చిన్నారిపై దారుణంగా అత్యాచారం, బాలిక‌కు తీవ్ర ర‌క్త‌స్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

మరో కేసులో, పశ్చిమ బెంగాల్‌లో 35 ఏళ్ల మద్యానికి అలవాటు పడిన తాగుబోతు తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని తన ఇంటిలో పూడ్చిపెట్టి పరారీలో ఉన్నాడు. నివేదికల ప్రకారం, నిందితుడు తన 3వ భార్య అయిన బాధితురాలు మంపి రాయ్‌తో తరచూ గొడవపడేవాడు. అతని మునుపటి ఇద్దరు భార్యలు అతని మద్యపాన వ్యసనం కారణంగా అతన్ని విడిచిపెట్టారు. నిందితుడు తన భార్యతో తీవ్ర వాగ్వాదం తర్వాత కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement