₹ 2,000 Currency Notes: భారీగా పడిపోయిన 2వేల నోట్ల చలామణి, త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం, ప్రస్తుతం చలామణిలో ఉన్న రెండువేల నోట్లు ఎన్నో తెలుసా?

పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు (2000 note) కొద్దిరోజుల్లో కనిపించకుండాపోతుందట. ఈ క్రమంలో చెలామణిలో ఉన్న నోట్లను క్రమక్రమంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్‌బీఐ(RBI). ఇందులో భాగంగానే కేంద్ర బ్యాంకు వీటి ముద్రణ ఆపేసి.. చెలామణిని తగ్గిస్తూ వస్తోంది. అలా ప్రస్తుతం రూ.2వేల నోట్ల సంఖ్య 214 కోట్లకు తగ్గిపోయింది.

2000 rupee note

New Delhi, May 28: పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు (2000 note) కొద్దిరోజుల్లో కనిపించకుండాపోతుందట. ఈ క్రమంలో చెలామణిలో ఉన్న నోట్లను క్రమక్రమంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్‌బీఐ(RBI). ఇందులో భాగంగానే కేంద్ర బ్యాంకు వీటి ముద్రణ ఆపేసి.. చెలామణిని తగ్గిస్తూ వస్తోంది. అలా ప్రస్తుతం రూ.2వేల నోట్ల సంఖ్య 214 కోట్లకు తగ్గిపోయింది. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం కేవలం 1.6శాతం మాత్రమే అని ఆర్‌బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2021 మార్చి చివరి నాటికి దేశంలో 245 కోట్ల రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా.. 2022 మార్చి చివరి నాటికి వీటి సంఖ్య 214 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. 2021 మార్చిలో చెలామణిలో మొత్తం కరెన్సీలో వీటి పరిమాణం 2శాతం కాగా.. ఈ ఏడాది మార్చి నాటికి అది 1.6శాతానికి తగ్గినట్లు తెలిపింది. అంటే మొత్తం కరెన్సీ విలువలో రూ.2వేల నోట్ల విలువ 17.3శాతం నుంచి 13.8శాతానికి తగ్గిపోయింది.

IMD on Monsoon: గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణశాఖ, మరో రెండు రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రకటన, కేరళలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ 

రూ.2వేల నోట్ల సంఖ్య తగ్గిపోతుంటే.. రూ.500 నోట్ల చలామణి మాత్రం విపరీతంగా పెరిగిందని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. 2021 మార్చి నాటికి 3వేల 867.90కోట్ల రూ.500నోట్లు వాడుకలో ఉండగా.. 2022 మార్చి చివరి నాటికి ఏకంగా రూ.4వేల 554.68 కోట్లకు పెరిగింది. దేశంలో చెలామణిలోని మొత్తం కరెన్సీలో వీటి పరిమాణమే(34.9శాతం) ఎక్కువ. నల్లధనాన్ని నిరోధించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2018-19 నుంచి రూ.2వేల నోట్ల ముద్రణను కేంద్రం నిలిపివేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement