Karnataka Election Results 2023: జెడీఎస్ కంచుకోటలో కాంగ్రెస్ పాగా, పాత మైసూరులో బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఓటర్లు, రెండో స్థానానికి పరిమితమైన కుమారస్వామి టీం

కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాకిచ్చింది. వెలువడతున్న ఫలితాల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని అందించే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Karnataka-Assembly-Elections-Results

కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాకిచ్చింది. వెలువడతున్న ఫలితాల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని అందించే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక అధికారాన్ని దక్కించుకోవాలంటే ప్రధానమైన ఓల్డ్ మైసూరు (Mysore) ప్రాంతంలో కాంగ్రెస్‌ దూసుకుపోతున్నది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యత, 72 స్థానాల్లో బీజేపీ ముందంజ, 25 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యం

జేడీఎస్ కంచు కోట అయిన పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 61 స్థానాలు ఉన్నాయి. అక్కడ 34 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో ఇప్పటివరకు జేడీఎస్‌కు (JDS) అడ్డా పాత మైసూర్‌లో కాంగ్రెస్ పార్టీ పాగావేసింది. 22 స్థానాలో జేడీఎస్‌ రెండో స్థానంలో ఉండగా, కేవలం 3 స్థానాలతో బీజేపీ మూడో ప్లేస్‌కు పరిమితమైంది.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభంజనం, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడుకు తరలింపు, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు రూమ్స్‌ బుక్‌

అయితే నగరాలు, పట్టణ ప్రాంతాలు, కోస్తాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గుచూపారు. కోస్టల్‌ కర్ణాటక, బెంగళూరులో అధికార బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోగా, హైదరాబాద్‌ కర్ణాటక, నార్త్‌ కర్ణాటక, సెంట్రల్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇక 15 కార్పొరేషన్లు, 75 నగర పంచాయతీల్లో బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉన్నది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement