Huzur Nagar Verdict: కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారన్న సైదిరెడ్డి, హుజూర్ నగర్‌లో 20 వేల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న ఇతర పార్టీలు

టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ , ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ తీర్పుతో స్పష్టమవుతుందని చెప్పారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని సైదిరెడ్డి చెప్పారు....

TRS- Sanampudi Saidi Reddy

Huzur Nagar, October 24:  హుజూర్ నగర్ ఉపఎన్నిక (Huzur Nagar Bypoll Results) లో కారు దూసుకుపోతుంది. 10వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి (Sanampudi Saidireddy)  20,500 ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కౌంటింగ్ మొదలైన తొలి రౌండ్ నుంచి సైది రెడ్డి ఆధిక్యతనే ప్రదర్శిస్తున్నారు. ఇక ప్రధాన పోటీదారు అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మారెడ్డి ఏ రౌండ్ లోనూ ఆధిక్యత కనబర్చలేకపోయారు. ఇక మిగతా పార్టీల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం 22 రౌండ్లు కౌంటింగ్ కొనసాగనుంది. సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీఆర్ఎస్  తమకు 30వేల ఆధిక్యంతో గెలుస్తామని భావించారు, అయితే ఫలితాలు అంతకంటే మెరుగ్గానే వస్తుండంతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది.

టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ , ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ తీర్పుతో స్పష్టమవుతుందని చెప్పారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని సైదిరెడ్డి చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana Skill University: సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

KTR On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు

CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Share Now